NEET SS 2026 : నీట్ సూపర్ స్పెషాలిటీ 2026 రిజిస్ట్రేషన్లు ప్రారంభం- పూర్తి వివరాలు ఇవే..

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్.. నీట్ సూపర్ స్పెషాలిటీ (నీట్​ ఎస్​ఎస్) 2026 పరీక్షకు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. నవంబర్ 18 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అర్హతలు, పరీక్ష తేదీలు, దరఖాస్తు విధానం గురించిన పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 30, 2026, 09:16:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

వైద్య విద్యలో అత్యున్నత సూపర్ స్పెషాలిటీ కోర్సుల్లో (డీఎం, ఎంసీహెచ్,డా.ఎన్​బీ) చేరాలనుకునే వైద్యులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. 'నీట్ సూపర్ స్పెషాలిటీ' (నీట్ ఎస్ఎస్) 2026 పరీక్షకు సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసిన నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్​బీఈఎంఎస్) ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది.

నీట్ సూపర్ స్పెషాలిటీ 2026 అప్డేట్స్..
నీట్ సూపర్ స్పెషాలిటీ 2026 అప్డేట్స్..

అర్హత కలిగిన అభ్యర్థులు బోర్డు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు. నవంబర్ 18, 2026 వరకు దరఖాస్తు గడువు ఉంది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు చెందిన వేలాది మంది ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ పూర్తి చేసిన యంగ్ డాక్టర్లు ఈ సూపర్ స్పెషాలిటీ సీట్ల కోసం పోటీ పడనున్నారు.

నీట్​ సూపర్​ స్పెషాలిటీ 2026 రిజిస్ట్రేషన్- అర్హత ప్రమాణాలు..

ఈ ప్రతిష్టాత్మక నీట్​ సూపర్​ స్పెషాలిటీ 2026 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు కింది విద్యార్హతలు కలిగి ఉండాలి:

పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ: అభ్యర్థులు గుర్తింపు పొందిన మెడికల్ కళాశాల లేదా విశ్వవిద్యాలయం నుంచి ఎండీ, ఎంఎస్, డీఎన్‌బీ లేదా దానికి సమానమైన పీజీ విద్యార్హత సాధించి ఉండాలి.

గడువు తేదీ: పీజీ డిగ్రీ ఉత్తీర్ణత లేదా కోర్సు పూర్తి చేసుకునే గడువు నవంబర్ 18, 2026 లేదా అంతకంటే ముందు ఉండటం తప్పనిసరి.

మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్: నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్​ఎంసీ/ఎంసీఐ) లేదా ఏదైనా స్టేట్ మెడికల్ కౌన్సిల్ (ఎస్​ఎంసీ)లో నమోదైన రిజిస్ట్రేషన్ ప్రామాణిక పత్రాన్ని కలిగి ఉండాలి. పరీక్ష రోజున హాల్ టికెట్‌తో పాటు ఈ ప్రూఫ్‌ను పరీక్షా కేంద్రంలో చూపించాల్సి ఉంటుంది.

నీట్​ సూపర్​ స్పెషాలిటీ 2026 రిజిస్ట్రేషన్- ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన తర్వాత, అభ్యర్థులు తమ దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకోవడానికి ఎడిట్ ఆప్షన్ ఇస్తారు.

  • ఎడిట్ విండో ప్రారంభం: నవంబర్ 20, 2026
  • ఎడిట్ విండో ముగింపు: నవంబర్ 22, 2026
  • అడ్మిట్ కార్డ్‌ల జారీ: డిసెంబర్ 7, 2026
  • పరీక్ష తేదీలు: డిసెంబర్ 11, 12, 2026 తేదీలలో దేశవ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత (సీబీటీ) పద్ధతిలో నీట్ సూపర్ స్పెషాలిటీ పరీక్ష నిర్వహించనున్నారు.

నీట్​ సూపర్​ స్పెషాలిటీ 2026- ఇలా దరఖాస్తు చేసుకోండి..

అభ్యర్థులు సులువుగా దరఖాస్తు చేసుకోవడానికి ఈ కింది స్టెప్స్​ని అనుసరించవచ్చు:

  • ముందుగా అధికారిక పోర్టల్ natboard.edu.in ని సందర్శించండి.
  • హోమ్‌పేజీలో ఉన్న 'NEET SS 2026' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • అనంతరం 'New Registration' లింక్‌ను ఎంచుకోండి.
  • మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ వంటి ప్రాథమిక వివరాలు అందించి రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి.
  • మీ ఈ-మెయిల్‌కు వచ్చే యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌లతో లాగిన్ అవ్వండి.
  • వ్యక్తిగత, విద్యా సంబంధిత వివరాలను పొందుపరిచి దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
  • నిర్దేశిత ఫార్మాట్‌లో పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, సంతకం, బొటనవేలి ముద్ర కాపీలను అప్‌లోడ్ చేయండి.
  • మీ సౌలభ్యాన్ని బట్టి నీట్ ఎస్‌ఎస్ పరీక్షా కేంద్రాల ప్రాధాన్యతను ఎంచుకోండి.
  • దరఖాస్తు రుసుమును ఆన్‌లైన్ ద్వారా చెల్లించి ఫారమ్‌ను సబ్మిట్ చేయండి. చివరిగా కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకుని భద్రపరుచుకోండి.

నీట్​ సూపర్​ స్పెషాలిటీ 2026 రిజిస్ట్రేషన్- అవసరమైన పత్రాలు..

నీట్​ సూపర్​ స్పెషాలిటీ 2026 దరఖాస్తు పూరించే సమయంలో అభ్యర్థులు డిజిటల్ రూపంలో అప్‌లోడ్ చేయడానికి పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సంతకం, ఎడమ చేతి బొటనవేలి ముద్రల స్కాన్ చేసిన కాపీలను సిద్ధంగా ఉంచుకోవాలి. సందేహాలు ఉంటే ఎన్‌బీఈఎంఎస్ కేర్ సపోర్ట్‌ను సంప్రదించవచ్చు.

నీట్​ సూపర్​ స్పెషాలిటీ 2026 రిజిస్ట్రేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More