కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలివే
కర్నూలు ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 43 ఖాళీలను రిక్రూట్ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు…. జూలై 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 43 పోస్టులున్నాయి. వీటిని కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు జూలై 16వ తేదీతో పూర్తవుతుంది. ఆఫ్ లైన్ లో అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
కర్నూలు మెడికల్ కాలేజీలో ఖాళీలు
కర్నూల్ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు - ముఖ్య వివరాలు
ఉద్యోగ ప్రకటన - ప్రభుత్వ మెడికల్ కాలేజీ, కర్నూల్, ఆంధ్రప్రదేశ్.
అర్హతలు -పైన పేర్కొన్న పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఎస్సీ, డిప్లొమా, ఇంటర్, పదో తరగతి పాసై ఉండాలి. పని చేసిన అనుభవం కూడా కలిగి ఉండాలి. https://kurnool.ap.gov.in/ వెబ్ సైట్ లో పూర్తి వివరాలు ఉంటాయి.
దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 42 ఏళ్ల లోపు ఉండాలి.
దరఖాస్తు విధానం - ఆఫ్ లైన్
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ - 16 జూలై 2025
అప్లికేషన్ ఫీజు కింద ఓసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ.200 కట్టాలి.
అప్లికేషన్ ఫామ్ ను https://kurnool.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పూర్తి చేసిన ఫారమ్ ను “ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్, కర్నూలు మెడికల్ కాలేజీ” చిరునామాకు పంపాలి.
వంద మార్కులను ప్రమాణికంగా తీసుకుని ఎంపిక చేస్తారు.(అకడమిక్స్ ఉత్తీర్ణత శాతంతో పాటు పని చేసిన అనుభవం ఆధారంగా మార్కులను కేటాయిస్తారు)
అధికారిక వెబ్ సైట్ - https://kurnool.ap.gov.in/
ఈ లింక్ పై క్లిక్ చేసి నోటిఫికేషన్ కు సంబంధించిన పీడీఎఫ్ చూడొచ్చు
News/News/కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలివే
News/News/కర్నూలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగ ఖాళీలు - దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ వివరాలివే