ఎయిమ్స్‌ మంగళగిరిలో 117 ఉద్యోగాలు - మంచి జీతం, నోటిఫికేషన్ వివరాలివే

ఏపీలోని ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్‌ రెసిడెంట్‌ పోస్టులను రిక్రూట్ చేయనున్నారు. మొత్తం 117 ఖాళీలు ఉన్నాయి. జూన్‌ 14వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు.

Published on: Jun 2, 2025, 12:00:33 IST
By , , Andhrapradesh, Guntur
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఎయిమ్స్‌(ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ మెడికల్ సైన్సెస్‌) మంగళగిరిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 117 సీనియర్ రెసిడెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఎయిమ్స్‌ మంగళగిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్
ఎయిమ్స్‌ మంగళగిరి నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

ఖాళీల వివరాలు…

నోటిఫికేషన్ లో తెలిపిన వివరాల ప్రకారం.... మొత్తం 117 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. అనస్థీషియాలజీ, అనాటమీ, బయో కెమిస్ట్రీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ అండ్ వ్యాస్క్యూలర్‌ సర్జరీ, కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్‌, డెర్మటాలజీ, ENT, ఫొరెన్సిక్‌ మెడిసిన్‌ అండ్ టాక్సికాలజీ, జనరల్ మెడిసిన్‌, జనరల్ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మెడికల్ ఆంకాలజీ, మైక్రోబయాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, న్యూక్లియర్‌ మెడిసిన్‌, ఆర్థోపెడిక్స్‌, పీడియాట్రిక్‌ సర్జరీ, పీడియాట్రిక్స్‌, పాథాలజీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీతో పాటు మరికొన్ని విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి.

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు…. పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్‌, డీఎం, ఎంఫిల్‌, ఎమ్ఎస్సీ, ఎంసీహెచ్‌లో పాసై ఉండాలి. అంతేకాకుండా పని చేసిన అనుభవం ఉండాలని నోటిఫికేషన్ లో తెలిపారు. ఈ వివరాలను aiimsmangalagiri.edu.in వెబ్ సైట్ లో చూడొచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.67,000 జీతం చెల్లిస్తారు. ఇక నాన్‌ మెడికల్ వారికి రూ.56,100 జీతం ఇస్తారు.

దరఖాస్తులు, ఎంపిక విధానం…

ఆన్ లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. ఈ గడువు జూన్ 14వ తేదీ నాటికి పూర్తవుతుంది. అప్లికేషన్లను పరిశీలించి షార్ట్ లిస్ట్ చేస్తారు. వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఇంటర్వ్యూలకు వచ్చేవారు అర్హత పత్రాలను తీసుకురావాల్సి ఉంటుంది. అయితే దరఖాస్తులు ఎక్కువగా వస్తే… రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంటుంది. వాటి ఆధారంగా ఇంటర్వూలకు ఎంపిక చేస్తారు. ఎయిమ్స్ మంగళగిరి(గుంటూరు జిల్లా) అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్ లో ఇంటర్వూలను నిర్వహిస్తారు.

దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు రూ.1,500 చెల్లించాలి. ఇక ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు రూ.1000 చెల్లించాల్సి ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.ఈ నోటిఫికేషన్ కు సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే recruitment.helpdesk@aiimsmangalagiri.edu.in మెయిల్ ను సంప్రదించవచ్చు.

అప్లికేషన్ లింక్ : https://forms.gle/NCDekBCzjxj51Dz18

ఈ లింక్ పై క్లిక్ చేసి ఎయిమ్స్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలను తెలుసుకోవచ్చు

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More