విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకులో 45 ఉద్యోగ ఖాళీలు - ముఖ్యమైన తేదీలు, వివరాలివే

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 45  క్లరికల్‌ ట్రైనీ పోస్టులను భర్తీ చేయనున్నారు.  దరఖాస్తుల స్వీకరణకు జులై 10వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.

Published on: Jul 4, 2025, 14:48:55 IST
By , , Visakhapatnam, Andhrapradesh
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 45 క్లరికల్ ట్రైనీ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు జూలై 10వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. నిజానికి జూన్ 30వ తేదీతోనే గడువు పూర్తి కాగా… అధికారులు గడువు పొడిగించారు. అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచిచారు.

విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లరికల్‌ ట్రైనీ పోస్టులు
విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంకులో క్లరికల్‌ ట్రైనీ పోస్టులు

డైరెక్ట్‌ రిక్రూట్మెంట్ప్రాతిపదికన ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఉమ్మడి హైదరాబాద్, నెల్లూరు, రాయలసీమ, గుంటూరు, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. https://www.vcbl.in/downloads వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. అప్లికేషన్ ఫామ్ కూడా అందుబాటులో ఉంటుంది.

నోటిఫికేషన్ ముఖ్య వివరాలు

  • ఉద్యోగ నోటిఫికేషన్ - విశాఖపట్నం కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్.
  • మొత్తం ఖాళీలు - 45
  • పోస్టులు - క్లరికల్‌ ట్రైనీ ఉద్యోగాలు
  • దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. పాటు ఇంగ్లీష్, తెలుగు తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఎంఎస్‌ ఆఫీస్‌ పరిజ్ఞానం ఉండాలి.
  • 01.06.2025 నాటికి 30 ఏళ్ల వయసు మించకూడదు. ఈ వివరాలను పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో చూడొచ్చు.
  • దరఖాస్తు రుసుం కింద రూ. 100 చెల్లించాలి.
  • దరఖాస్తు విధానం - ఆన్ లైన్/ ఆఫ్ లైన్(అప్లికేషన్ ఫామ్ అధికారిక వెబ్ సైట్ లో ఉంటుంది)
  • జీతం - ట్రైనీ సమయంలో నెలకు రూ.15,000 ఇస్తారు.పైగా అలవెన్సులు ఉంటాయి.
  • రాత పరీక్షలు, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
  • ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్‌, గుంటూరు, నెల్లూరు, రాయలసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, ప్రకాశం జిల్లాల్లో పని చేయాల్సి ఉంటుంది.
  • అధికారిక వెబ్ సైట్ - https://www.vcbl.in/downloads
  • ఏమైనా సందేహాలు ఉంటే 08912788462 ఫోన్ నెంబర్ ను సంప్రదించవచ్చు.

ఈ లింక్ పై క్లిక్ చేసి పూర్తిస్థాయి నోటిఫికేషన్ చూడొచ్చు

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More