ఏపీ హైకోర్టులో 'లా క్లర్క్' ఉద్యోగాలు - నోటిఫికేషన్ వివరాలివే
ఏపీ హైకోర్టు నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా 4 లా క్లర్క్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు జూలై 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
ఏపీ హైకోర్టులో లా క్లర్క్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ లో భాగంగా 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆఫ్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. అర్హులైన అభ్యర్థులు జూలై 19వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

లా క్లర్క్ ఉద్యోగాలు - ముఖ్యమైన వివరాలు
- ఉద్యోగ ప్రకటన - హైకోర్టు, ఆంధ్రప్రదేశ్
- ఉద్యోగాలు - లా క్లర్క్
- మొత్తం ఖాళీలు - 04
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఐదేళ్లు లేదా మూడేళ్ల లా డిగ్రీ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో జూలై 19 లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- అభ్యర్థుల వయో పరిమితి 18-30 సంవత్సరాలు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు వయో పరిమితి సడలింపు ఉంటుంది.
- దరఖాస్తులను... రిజిస్ట్రార్, హైకోర్ట్ ఆఫ్ అమరావతి, నేలపాడు, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ - 522239 చిరునామా కు పంపించాలి.
- ఎలాంటి రాత పరీక్ష లేకుండా, అభ్యర్థులను విద్యార్హతలు, మెరిట్ మార్కులు, వైవా వాయిస్(ఇంటర్వ్యూ) ఆధారంగా ఎంపిక చేస్తారు.
- ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.35,000 వరకు జీతం ఇస్తారు.
- అధికారిక వెబ్ సైట్ - https://aphc.gov.in/
ఈ లింక్ పై క్లిక్ చేసి లా క్లర్క్ ఉద్యోగ దరఖాస్తు ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


