ఏపీ వైద్యారోగ్యశాఖలో 77 కాంట్రాక్ట్ ఉద్యోగాలు - మంచి జీతం, కేవలం ఇంటర్వ్యూనే
ఏపీ వైద్యారోగ్యశాఖ పరిధిలో కాంట్రాక్ట్ పద్ధతిలో పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 40 ప్రొఫెసర్లు, 37 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులు ఉన్నాయి. జూలై 17వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 40 ప్రొఫెసర్లు, 37 అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.ఈ మేరకు ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఏపీలో కాంట్రాక్ట్ పద్ధతిలో ప్రొఫెసర్ల భర్తీకి నోటిఫికేషన్
ఈ పోస్టుల భర్తీకి జూలై 16వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. https://apmsrb.ap.gov.in/msrb ఈ లింక్‌పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. జూలై 17వ తేదీన వాకిన్ రిక్రూట్మెంట్ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఎంపికైన వారికి రూ. లక్ష నుంచి 2.5 లక్షల వరకు జీతం ఇస్తారు.
కాంట్రాక్ట్ ఉద్యోగాలు - ముఖ్య వివరాలు
ఉద్యోగ నోటిఫికేషన్ - డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
మొత్తం ఖాళీలు - 77
ఉద్యోగ ఖాళీల వివరాలు - 40 ప్రొఫెసర్లు, 37 అసోసియేట్ ప్రొఫెసర్లు.
అర్హతలు - ఎంబీబీఎస్/ ఎండీ/ఎంఎస్/డీఎన్ బీ పూర్తి చేసి ఉండాలి. పని చేసిన అనుభవం ఉండాలి. పూర్తిస్థాయి నోటిఫికేషన్ లో వివరాలను చూడొచ్చు.
కాంట్రాక్ట్ విధానంలో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. మూడేళ్ల కాలపరిమితికి పని చేయాలి.
దరఖాస్తు విధానం - ఆన్ లైన్ నుంచి అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
అప్లికేషన్ ఫీజు - రూ. 2 వేలు
ఎంపికైన వారికి నెల జీతం - రూ. 1.5 లక్షల నుంచి రూ. 2.5 లక్షల వరకు ఉంటుంది.ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ కు వేర్వురుగా ఉంటుంది.
30.06.2025 నాటికి 69 ఏళ్ల లోపు ఉండాలి.
ఎంపిక విధానం -వాక్ ఇన్ ఇంటర్వ్యూలు
వాక్ ఇన్ ఇంటర్వ్యూ తేదీ - 17 జూలై 2025 ( డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్,ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్, హన్మన్ పేట, విజయవాడ)
అధికారిక వెబ్ సైట్ - https://apmsrb.ap.gov.in/msrb/