...
...
Next Story

మహిళలకు గుడ్ న్యూస్ - ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్, జూలై 5 లాస్ట్ డేట్

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఆశా కార్యకర్తల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. మొత్తం 30 ఖాళీలు ఉన్నాయి. అర్హులైన వారు జులై 5వ తేదీ వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలి.

Published on: Jun 29, 2025 12:30 PM IST
By , , Andhrapradesh, East Godavari
Prefer HTon Google
Advertisement

తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 30 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు అధికారులు వివరాలను ప్రకటించారు.

ఆశా ఉద్యోగాలు
ఆశా ఉద్యోగాలు

నోటిఫికేషన్ లో పేర్కొన్న వివరాల ప్రకారం…. అనపర్తి–3, బిక్కవోలు-1, రంగంపేట-2, రాజమహేంద్రవరం రూరల్-4, కడియం–3, రాజానగరం-2, కోరుకొండ-2, సీతానగరంం 2, గోకవరం–1, దేవరపల్లి-3, నల్లజర్ల–2, తాళ్ళపూడి –1, కొవ్వూరు రూరల్-1, చాగల్లు–1, పెరవలి-1, ఉండ్రాజవరంలో 1 పోస్టు ఉంది.

జూలై 5 గడువు…

ఈ పోస్టుల భర్తీకి ఈ నెల 28 నుంచే దరఖాస్తులస్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వాళ్లు… జూలై 5 వరకు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు.

ముఖ్య వివరాలు…

  • నోటిఫికేషన్ విడుదల - 28-06-2025
  • దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - 05-07-2025
  • ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ - 17-07-2025
  • అభ్యంతరాల స్వీకరణ - 21-07-2025
  • ఫైనల్ మెరిట్ లిస్ట్ - 24-07-2025
  • ఫలితాలు విడుదల - 26-07-2025

ఆఫ్ లైన్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి. https://eastgodavari.ap.gov.in వెబ్ సైట్ నుంచి ఈ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. మీ వివరాలను నమోదు చేసి… విద్యార్హత పత్రాలతో పాటు ఆధార్ లేదా రేషన్కార్డు, కుల,ఆదాయ ధ్రువీకరణకు సంబంధించిన జిరాక్స్ పత్రాలను జత చేయాలి. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే మహిళా అభ్యర్థులు స్థానికులై ఉండాలి. కనీసం పదో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe