యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష తేదీలు విడుదల.. ఎప్పుడు ఏ పరీక్ష? ఇక్కడ చూడండి!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ శుక్రవారం నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్(NET) జూన్ 2025 వివరణాత్మక పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ప్రకారం పరీక్ష జూన్ 25 నుండి ప్రారంభమై జూన్ 29న ముగుస్తుంది.
ూన్ సెషన్ యూజీసీ నెట్ పరీక్ష కొత్త తేదీలు, సబ్జెక్టుల వారీగా షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. 85 సబ్జెక్టులకు యూజీసీ నెట్ పరీక్షను సీబీటీ విధానంలో జూన్ 25 నుంచి 29 వరకు నిర్వహించనుంది. గతంలో జూన్ 21 నుంచి 30 వరకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే. పరీక్షను రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది.

జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత కోసం, పీహెచ్‌డీలో ప్రవేశానికి యూజీసీ నెట్ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్షకు 10 రోజుల ముందు అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్ష నగరానికి సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ పేర్కొంది. పరీక్ష తేదీలు 25 జూన్ 2025 ఉదయం షిఫ్ట్‌లో ఎడ్యుకేషన్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈవెనింగ్ షిఫ్ట్ ఎలక్ట్రానిక్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్ మరియు జర్నలిజం. 26 జూన్ 2025 మార్నింగ్ షిఫ్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్, సోషల్ వర్క్, హోమ్ సైన్స్, మ్యూజిక్. ఈవెనింగ్ షిఫ్ట్ పొలిటికల్ సైన్స్, ఇండియన్ కల్చర్, బౌద్ధం, జైన్, గాంధీ అండ్ పీస్ స్టడీస్, ఆర్కియాలజీ.
27 జూన్ 2025 మార్నింగ్ షిఫ్ట్ కామర్స్, లింగ్విస్టిక్స్, విజువల్ ఆర్ట్స్ (పెయింటింగ్/ స్కల్ప్చర్/ డిజైన్/ అప్లైడ్ ఆర్ట్/ ఆర్ట్ హిస్టరీ), టూరిజం అడ్మినిస్ట్రేషన్ అండ్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా అండ్ కమ్యూనిటీ హెల్త్. ఈవెనింగ్ షిఫ్ట్ ఇంగ్లిష్, యోగా, హిందూ స్టడీస్. 28 జూన్ 2025 మార్నింగ్ షిఫ్ట్ హిస్టరీ. ఈవెనింగ్ షిఫ్ట్ మేనేజ్ మెంట్, ఫిజికల్ ఎడ్యుకేషన్. 29 జూన్ 2025 ఉదయం షిఫ్ట్ హిందీ, ఫ్రెంచ్, సోషియాలజీ. ఈవెనింగ్ షిఫ్ట్ జాగ్రఫీ, ఎకనామిక్స్, మ్యూజియాలజీ, కన్జర్వేషన్.
యూజీసీ నెట్ పరీక్షను జూనియర్ ప్రొఫెసర్ ఫెలోషిప్ (జెఆర్ఎఫ్), అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎలిజిబిలిటీ, పీహెచ్డీ ప్రవేశానికి సంవత్సరానికి రెండుసార్లు నిర్వహిస్తారు. యూజీసీ నెట్ పరీక్షలో అభ్యర్థులు రెండు పేపర్లు ఇవ్వాల్సి ఉంటుంది. పేపర్-1లో జనరల్ ఆప్టిట్యూడ్, టీచింగ్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన ప్రశ్నలు, పేపర్-2లో వారు ఎంచుకున్న సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లకు కనీస అర్హత మార్కులు జనరల్ కేటగిరీకి 40శాతం, రిజర్వ్డ్ కేటగిరీకి 35శాతం.
పరీక్షకు 10 రోజుల ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్‌కు సంబంధించిన సమాచారాన్ని అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని ఎన్టీఏ తెలియజేసింది. ఏదైనా సహాయం కోసం అభ్యర్థులు యూజీసీ నెట్ జూన్ 2025 హెల్ప్‌లైన్ నంబర్ 011-40759000 లేదా ugcnet@nta.ac.inకు ఇమెయిల్ చేయవచ్చు.
ఇక్కడ క్లిక్ చేసి పూర్తి షెడ్యూల్ చూడండి..
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper



