Oppo A7 Pro Max : 10000ఎంఏహెచ్ బ్యాటరీతో ఒప్పో కొత్త స్మార్ట్‌ఫోన్- ఏ7 ప్రో మ్యాక్స్ లాంచ్ డేట్ ఫిక్స్..
ఒప్పో తన ఏ-సిరీస్‌లో అత్యంత భారీ 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో 'Oppo A7 Pro Max' స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో లాంచ్ చేయడానికి సిద్ధం చేసింది. వచ్చే నెల మొదటి వారంలో రానున్న ఈ ఫోన్ రంగులు, వేరియంట్లు, డిజైన్ వివరాలు ఇక్కడ చూడండి..
స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఒప్పో తీపి కబురు అందించింది. తన పాపులర్ ఏ-సిరీస్‌లో సరికొత్తగా 'ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్' స్మార్ట్‌ఫోన్‌ను ఆగస్టు మొదటి వారంలో చైనా మార్కెట్లో ఆవిష్కరించనున్నట్లు గురువారం అధికారికంగా ప్రకటించింది. భారీ 10,000ఎంఏహెచ్ బ్యాటరీతో రానున్న ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్లను కంపెనీ ఇప్పటికే ప్రారంభించింది. లాంచ్ తేదీతో పాటు ఈ హ్యాండ్‌సెట్ ఏ ఏ రంగుల్లో వస్తుంది, ఎన్ని వేరియంట్లలో లభిస్తుంది, దీని లుక్ ఎలా ఉండబోతోంది వంటి ఆసక్తికర వివరాలను కంపెనీ వెల్లడించింది.

ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్- ఆగస్టు 4న గ్రాండ్ లాంచ్..
చైనీస్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ‘విబో’లో ఒప్పో చేసిన పోస్ట్ ప్రకారం.. ఈ ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ స్థానిక కాలమానం ప్రకారం ఆగస్టు 4వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకు (భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12:00 గంటలకు) చైనాలో అధికారికంగా విడుదల కానుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ మూడు ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లలో లభించనుందని స్పష్టం చేసింది. డార్క్ మౌంటెన్స్ (బ్లాక్), రైడింగ్ ది వేవ్స్ (బ్లూ), ది ఫ్యూచర్ ఈజ్ బ్రైట్ (ఆరెంజ్) రంగుల్లో దీనిని తీసుకువస్తున్నారు.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్- ర్యామ్, స్టోరేజ్ వేరియంట్లు..
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్ ఫోన్ మొత్తం మూడు ర్యామ్, స్టోరేజ్ కాన్ఫిగరేషన్లలో అందుబాటులోకి రానుంది:
8GB RAM + 128GB స్టోరేజ్
12GB RAM + 256GB స్టోరేజ్
12GB RAM + 512GB స్టోరేజ్
ప్రస్తుతం చైనాలోని ఒప్పో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్ల కోసం అందుబాటులో ఉంది.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్- స్టైలిష్ డిజైన్.. లగ్జరీ లుక్!
డిజైన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ వెనుక భాగంలో ఫ్లాట్ ప్యానెల్‌ను కలిగి ఉంది. పైన రెక్టాంగ్యులర్ కెమెరా మాడ్యూల్‌ను అమర్చారు. కవర్ వెనుక 3డీ ఎంబాస్డ్ టెక్స్చర్ డిజైన్‌ను అందించడం వల్ల ఫోన్ ఎంతో ప్రీమియమ్‌గా కనిపిస్తోంది. వెనుకవైపు ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్యానెల్ దిగువ భాగంలో ఒప్పో బ్రాండింగ్ స్పష్టంగా కనిపిస్తుంది.
ఫోన్ కుడి వైపున పవర్ బటన్, వాల్యూమ్ బటన్లు ఉన్నాయి. కింద భాగంలో టైప్-సి ఛార్జింగ్ పోర్ట్, స్పీకర్ గ్రిల్, సిమ్ ట్రై స్లాట్ అమర్చారు. ముందరి భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం సెంటర్ హోల్-పంచ్ కటౌట్‌తో కూడిన ఫ్లాట్ డిస్‌ప్లేను అందించారు.
ఒప్పో ఏ7 ప్రో మ్యాక్స్- 10,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీ!
ఒప్పో ఏ-సిరీస్‌లోనే అత్యంత భారీగా ఏకంగా 10,000ఎంఏహెచ్ బ్యాటరీని ఈ ఏ7 ప్రో మ్యాక్స్ ఫోన్‌లో అందిస్తుండటం గమనార్హం. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే రోజులకు పైగా బ్యాటరీ లైఫ్ ఇస్తుందని సమాచారం. ఇక ఇటీవల గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌పై ఈ ఫోన్ కనిపించింది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 5 ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై ఇది పనిచేస్తుందని, దీని గరిష్ట క్లాక్ స్పీడ్ 2.40జీహెచ్‌జెడ్ వరకు ఉంటుందని సమాచారం. రాబోయే రోజుల్లో ఈ ఫోన్ కెమెరా, ధర వివరాలపై మరింత స్పష్టత రానుంది.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


