Poco M8x : 7900ఎంఏహెచ్ బ్యాటరీ, 50ఎంపీ కెమెరాతో పోకో కొత్త స్మార్ట్‌ఫోన్- ధర ఎంతంటే..
భారత మార్కెట్లోకి సరికొత్త పోకో ఎం8ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్ విడుదలైంది. 7900ఎంఏహెచ్ భారీ బ్యాటరీ, స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తున్న ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 20,999గా ఉంది. ఆగస్టు 27 నుంచి దీని విక్రయాలు ప్రారంభం కానున్నాయి.
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ పోకో.. తన ఎం-సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను భారతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. కంపెనీ నుంచి వస్తున్న మిడ్-రేంజ్ లైనప్‌లో మూడొవ మోడల్‌గా ‘పోకో ఎం8ఎక్స్ 5జీ’ అధికారికంగా లాంచ్ అయింది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పోకో ఎం8 5జీ, పోకో ఎం8 పవర్ మోడల్ సరసన ఈ కొత్త ఫోన్ చేరింది. మూడు ఆకర్షణీయమైన రంగులలో లభించే ఈ ఫోన్‌లోని గ్రీన్ కలర్ వేరియంట్ వెనుక భాగంలో వీగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తుంది.

ఈ నేపథ్యంలో ఈ పోకో ఎం8ఎక్స్ 5జీ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
పోకో ఎం8ఎక్స్ 5జీ- ధర..
భారత మార్కెట్లో పోకో ఎం8ఎక్స్ 5జీ బేస్ వేరియంట్ ధర రూ. 20,999గా నిర్ణయించారు. ఇందులో 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది. ఇక హైఎండ్ వేరియంట్ అయిన 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ. 22,999గా ఉంది. అంతేకాకుండా కస్టమర్ల కోసం కంపెనీ రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్‌ను అందిస్తోంది.
ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్ వేదికగా ఆగస్టు 27 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. బ్లాక్, బ్లూ, లెదర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.
పోకో ఎం8ఎక్స్ 5జీ- డిస్ప్లే, ప్రత్యేక ఫీచర్లు..
పోకో ఎం8ఎక్స్ 5జీ ఒక డ్యూయల్-సిమ్ స్మార్ట్‌ఫోన్. ఇది షావోమికి చెందిన ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపర్‌ఓఎస్ 3పై పని చేస్తుంది. కంపెనీ ఈ హ్యాండ్‌సెట్‌కు నాలుగు సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌గ్రేడ్‌లు, ఆరు సంవత్సరాల పాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను అందిస్తామని హామీ ఇస్తోంది.
ఈ ఫోన్ 6.9-అంగుళాల హెచ్‌డీ+ ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. స్క్రీన్ రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ఇచ్చారు. చేతులు తడిగా ఉన్నప్పుడు కూడా సులభంగా టచ్ రెస్పాన్స్ అందేలా వెట్ టచ్ 2.0 ఫీచర్‌ను సైతం జోడించారు. అలాగే టూవీ రెయిన్‌లాండ్ లో బ్లూ లైట్ సర్టిఫికేషన్, డస్ట్ అండ్ స్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ64 రేటింగ్ ఇందులో ఉంది.
పోకో ఎం8ఎక్స్ 5జీ- ప్రాసెసర్, కెమెరా పనితీరు..
ఈ పోకో కొత్త స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ సిరీస్ చిప్‌సెట్‌ను అమర్చారు. ఇది 4ఎన్ఎం ప్రక్రియపై రూపుదిద్దుకుంది. దీనివల్ల యాప్‌లు సాధారణం కంటే 43 శాతం వేగంగా ఓపెన్ అవుతాయని కంపెనీ చెబుతోంది. ఆంటుటు బెంచ్‌మార్కింగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ ఫోన్ 6,50,000కి పైగా పాయింట్లు సాధించింది. ఇందులో 6జీబీ వరకు ఎల్‌పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, యూఎఫ్‌ఎస్ 2.2 స్టోరేజ్ ఇచ్చారు.
ఫోటోగ్రఫీ విషయానికి వస్తే.. వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్ ప్రధాన ఆకర్షణగా నిలవగా, 2ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ లభిస్తుంది. దీనితో పాటు మరొక 2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాను ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 8-మెగాపిక్సెల్ కెమెరాను అమర్చారు. ఈ ఫోన్ ద్వారా 1080పీ వీడియోలను రికార్డ్ చేయవచ్చు.
పోకో ఎం8ఎక్స్ 5జీ- భారీ బ్యాటరీ..
ఈ పోకో ఎం8ఎక్స్ 5జీ ప్రధాన హైలైట్ దీని బ్యాటరీ అనే చెప్పాలి. ఇందులో 7,900ఎంఏహెచ్ భారీ బ్యాటరీని ఇచ్చారు. ఇది 45డబ్ల్యూ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 22.5డబ్ల్యూ వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 35 గంటల పాటు సోషల్ మీడియా స్క్రోలింగ్, 27 రోజుల పాటు మెసేజింగ్, 13 గంటల జీపీఎస్ నేవిగేషన్ లేదా 64 గంటల పాటు మ్యూజిక్ ప్లేబ్యాక్ ఆస్వాదించవచ్చని కంపెనీ పేర్కొంది. అలాగే ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు ట్రిపుల్ కూలింగ్ సొల్యూషన్‌ను అందించారు.
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


