హైదరాబాద్‌లో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ 'క్లబ్ ఒడిస్సీ'ని ఆవిష్కరించిన రాజపుష్ప ప్రాపర్టీస్
రాజపుష్ప ప్రాపర్టీస్ హైదరాబాద్‌లో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ క్లబ్ ఒడిస్సీని ఆవిష్కరించింది. దీనిద్వారా నివాసితులు ఎన్నో ప్రయోజనాలు పొందుతారు.
క్షిణ భారతదేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ డెవలపర్‌లలో ఒకటైన రాజపుష్ప ప్రాపర్టీస్.. నార్సింగిలో ప్రధాన నివాస సముదాయం రాజపుష్ప ప్రావిన్షియాలో అతిపెద్ద లగ్జరీ క్లబ్‌హౌస్ క్లబ్ ఒడిస్సీని ఘనంగా ప్రారంభించినట్లు ప్రకటించింది. 1,00,000 ప్లస్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న క్లబ్ ఒడిస్సీ.. నివాసితుల కోసం ఆరోగ్యం, ఫిట్‌నెస్, విశ్రాంతి, ఇతర సౌకర్యాలను అందించే కేంద్రంగా మారనుంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ముఖ్య అతిథిగా, రాజపుష్ప ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి గౌరవ అతిథిగా వచ్చారు.

ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఔటర్ రింగ్ రోడ్‌కి కొంత దూరంలో ఉన్న రాజపుష్ప ప్రావిన్షియా.. 23.75 ఎకరాల విస్తీర్ణంలో 3,498 ప్రీమియం అపార్ట్‌మెంట్లతో కూడిన మాస్టర్-ప్లాన్డ్ కమ్యూనిటీ. మొదటి దశ (1,908 యూనిట్లు) 95 శాతం అమ్ముడైపోగా, రెండో దశ (1,590 యూనిట్లు) రాబోయే 6-9 నెలల్లో అప్పగించడానికి సిద్ధంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్ లగ్జరీ రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పటికే ఒక కీలక మైలురాయిని సాధించింది.
కమ్యూనిటీలో 6.5 ఎకరాల సెంట్రల్ కోర్ట్‌యార్డ్, 80 శాతం ఖాళీ స్థలాలు, జాగింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు, స్కైవాక్‌లు, అందమైన పచ్చని ల్యాండ్‌స్కేప్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఆరోగ్యాన్ని, మంచి జీవనశైలిని ప్రోత్సహించడానికి ప్రత్యేకంగా డిజైన్ చేశారు.
ఈ సందర్భంగా రాజపుష్ప ప్రాపర్టీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పి. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ...'క్లబ్ ఒడిస్సీతో మేం సంప్రదాయ రియల్ ఎస్టేట్‌కు మించి మంచి లైఫ్‌స్టైల్ వ్యవస్థను సృష్టించాం. ఆనందాన్ని పెంపొందించే కమ్యూనిటీలను నిర్మించాలనే మా నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.' అని అన్నారు.
పుల్లెల గోపీచంద్ కూడా ఈ ప్రాజెక్ట్‌ను ప్రశంసించారు. 'కమ్యూనిటీ అభివృద్ధి పట్ల ఇంత ముందుచూపు ఉండటం నాకు స్ఫూర్తినిచ్చింది. క్లబ్ ఒడిస్సీ వంటి సౌకర్యాలు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడమే కాకుండా చురుకైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తాయి.' అని పేర్కొన్నారు.
క్లబ్ ఒడిస్సీ అనేది మొదటి దశ నివాసితులకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన లైఫ్స్టైల్ కేంద్రం. ఇందులో ఉండే సౌకర్యాలు చూద్దాం.. అతి పెద్ద స్విమ్మింగ్ పూల్, జిమ్, ఇండోర్ క్రీడా మైదానాలు, రుచికరమైన భోజనం అందించే రెస్టారెంట్లు, కేఫ్‌లు, లాంజ్‌లు, స్పా, వెల్‌నెస్ సెంటర్, లోపల ఉండే ఏసీ బాస్కెట్‌బాల్ కోర్టు, కో-వర్కింగ్ లాంజ్‌లు, ఇతర అవసరాలకు హాళ్ళు, వినోద కేంద్రాలు/ సృజనాత్మక స్టూడియోలు, వర్క్-ఫ్రమ్-క్లబ్ ప్రాంతాలు, మెడిటేషన్/యోగా/ఏరోబిక్స్ గదితోపాటుగా మరెన్నో సౌకర్యాలు ఉంటాయి.
రెండో దశ నివాసితులకు కూడా ఇదే స్థాయిలో క్లబ్ ఒయాసిస్ అనే మరో అద్భుతమైన క్లబ్ రాబోతోంది. దీనివల్ల మొత్తం టౌన్‌షిప్‌లోని ప్రజలకు మంచి వినోద సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. రాజపుష్ప ప్రావిన్షియా హైదరాబాద్‌లోని ఉత్తమ నివాస ప్రాంతాలలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper



