...
...
Next Story

వడ్డీ రేట్లు యథాతథం : ఆర్బీఐ ప్రకటన- జీడీపీ అంచనాలు కూడా..

ఊహించినదే జరిగింది! వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. ఫలితంగా రెపో రేటు 5.5శాతం వద్ద కొనసాగుతుంది.

Published on: Aug 6, 2025, 10:10:33 IST
By ,
Prefer HTon Google
Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ విధిస్తున్న టారీఫ్​ల అనిశ్చితి నేపథ్యంలో దేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగించాలని ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) నిర్ణయించింది. ఈ మేరకు మొనేటరీ పాలసీ సమావేశం ముగింపు అనంతరం ఆర్బీఐ గవర్నర్​ సంజయ్​ మల్హోత్రా కీలక ప్రకటన చేశారు. ద్రవ్య విధానంలో ‘న్యూట్రల్’ వైఖరి కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఆర్​బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్​ వివరాలు..
ఆర్​బీఐ మొనేటరీ పాలసీ మీటింగ్​ వివరాలు..

ఫలితంగా రెపో రేటు 5.5శాతం వద్ద కొనసాగుతుంది.

సంజయ్ మల్హోత్రా నేతృత్వంలో ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు జరిగిన ఆర్బీఐ ద్రవ్య విధాన సమీక్ష సమావేశం.. ఈ ఆర్థిక సంవత్సరానికి మూడవ ద్వైమాసిక మీటింగ్​. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే ఒకసారి రేటు కోత, 100 బేసిస్ పాయింట్ల (బీపీఎస్​) సీఆర్ఆర్ తగ్గింపు ద్వారా సడలింపు చర్యలను ఆర్బీఐ ముందుగానే చేపట్టింది.

జూన్ నెల ఆర్బీఐమొనేటరీ పాలసీ మీటింగ్​లో, ద్రవ్య విధాన కమిటీ కీలక వడ్డీ రేటును 6 శాతం నుంచి 5.50 శాతానికి, అంటే 50 బేసిస్ పాయింట్లు తగ్గించి అందరిని ఆశ్చర్యం కలిగించింది. అదే సమయంలో, ఎంపీసీ తమ విధాన వైఖరిని ‘అకామోడేటివ్’ నుంచి ‘న్యూట్రల్’కి మార్చింది. అంతేకాకుండా.. నగదు నిల్వల నిష్పత్తిని కూడా 4 శాతం నుంచి 3 శాతానికి, అంటే 100 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

“ద్రవ్యోల్బణం తగ్గడంతో గతంలో రెపో రేటును తగ్గించడానికి వీలు కలిగింది. ద్రవ్యోల్బణం స్వల్పకాలంలో, మధ్యకాలంలో ఆర్బీఐ లిమిట్​ లోపలే ఉంటుందని అంచనా వేశాము. ఆహార ద్రవ్యోల్బణం పరిస్థితి కూడా మెరుగ్గానే ఉంది. అందుకే ఈసారి ఈ నిర్ణయం తీసుకున్నాము,” అని తాజాగా జరిగిన మీటింగ్​లో సంజయ్​ మల్హోత్రా తెలిపారు.

భారత దేశ జీడీపీపై..

“అంతర్జాతీయంగా వాణిజ్య సవాలు కొనసాగుతున్నప్పటికీ, భారత ఆర్థిక వ్యవస్థ ప్రకాశవంతంగానే ఉంది. కానీ ప్రపంచ ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం నెమ్మదించవచ్చు,” అని ఆర్బీఐ గవర్నర్​ చెప్పుకొచ్చారు.

ప్రపంచ దేశాలపై సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​, ఇండియాపైనా 25శాతం టారీఫ్​లను ప్రకటించారు. రష్యాతో చమురు దిగుమతుల నేపథ్యంలో మరిన్న సుంకాలు విధిస్తానని భారత్​ను హెచ్చరించారు. ఇది దేశ జీడీపీని ప్రభావితం చేస్తుందన్న ఆందోళనల మధ్య ఆర్బీఐ గవర్నర్​ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

ఈ నేపథ్యంలోనే ఈసారి వడ్డీ రేట్ల కోత ఉండకపోవచ్చని మార్కెట్​లో అంచనాలు నెలకొన్నాయి. రెపో రేటుపై ఆర్బీఐ ప్రకటన అనంతరం, ఉదయం 10 గంటల 20 నిమిషాల సమయంలో స్టాక్​ మార్కెట్​లు ఫ్లాట్​గా కొనసాగుతున్నాయి. నిఫ్టీ50 17 పాయింట్ల నష్టంతో 24,633 వద్ద ట్రేడ్​ అవుతోంది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 30 పాయింట్లు పెరిగి 80,740 వద్ద కొనసాగుతోంది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks