...
...
Next Story

తెలంగాణలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు - ఈ నెల 7 నుంచి కౌన్సెలింగ్, మెరిట్ లిస్ట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి

బాసర, మహబూబ్ నగర్ లోని ఐఐఐటీ ప్రవేశాల మెరిట్ లిస్ట్ లు విడుదలయ్యాయి. బాసర ఆర్జీయూకేటీలో 1,509, మహబూబ్‌నగర్‌లోని క్యాంపస్ లో 181 సీట్లకు ఎంపికైన వారి జాబితాను అధికారులు వెల్లడించారు. ఈనెల 7వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ కానుంది.

Published on: Jul 5, 2025, 09:58:18 IST
By , , Telangana, Basara
Prefer HTon Google
Advertisement

తెలంగాణలోని ట్రిపుల్ ఐటీ(ఆర్జీయూకేటీ) క్యాంపస్ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల మార్కుల ఆధారంగా…. మెరిట్ లిస్ట్ ను విడుదల చేశారు. వీరికి సంబంధించిన జాబితాను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. అయితే ప్రాథమికంగా ఎంపికైన ఈ విద్యార్థులకు కౌన్సెలింగ్ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను కూడా అధికారులు ప్రకటించారు.

కౌన్సెలింగ్ తేదీలు….

ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు - 2025
ట్రిపుల్ ఐటీ ప్రవేశాలు - 2025

ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో ప్రవేశాలకు ప్రాథమికంగా ఎంపికైన విద్యార్థులకు జూలై 7 నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనున్నారు. జూలై 9వ తేదీ వరకు ఈ ప్రక్రియ ఉంటుంది. ఇందుకు హాజరయ్యే విద్యార్థులు… నిర్మల్ జిల్లాలోని బాసరట్రిపుల్ ఐటీ క్యాంపస్ కేంద్రానికి రావాల్సి ఉంటుంది.

మరోవైపు ఆర్మీ, NCC, స్పోర్ట్స్, దివ్యాంగులు తదితర ప్రత్యేక కేటగిరీల విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన పూర్తయింది. తాజాగా మెరిట్ లిస్టులో ఉన్న విద్యార్థులకు కూడా కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తి చేసి…. ఆగస్టు నాలుగు నుంచి తరగతులను ప్రారంభించనున్నారు.

మెరిట్ లిస్ట్ వివరాలు….

ప్రస్తుతం రాష్ట్రంలో బాసరతో పాటు మహబూబ్ నగర్ లో ట్రిపుల్ ఐటీక్యాంపస్ కేంద్రాలు ఉన్నాయి. మొత్తం 1,690 సీట్లు ఉండగా… ఈసారి 72 శాతం సీట్లు బాలికలకే దక్కాయి. బాలికలు 1,225 మంది(72 శాతం) ఉండగా… బాలురు 465 మంది(18 శాతం) ఉన్నారు. ఇక నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన విద్యార్థులు ఏకంగా 889 మంది ఎంపికయ్యారు.

ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది.ప్రాథమికంగా ఎంపిక మెరిట్ జాబితాను https://www.rgukt.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వెబ్ సైట్ లోకి వెళ్లిన తర్వాత యూజీ అడ్మిషన్స్ 2025పై క్లిక్ చేయాలి. ఇక్కడ మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో ప్రొవిజినల్ సెలెక్టడ్ లిస్ట్ ఆఫ్ యూజీ అడ్మిషన్స్ - 2025 అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేసి లిస్ పొందవచ్చు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks