రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు.. అది కూడా కెప్టెన్‌గా.. అనుకున్నదాని కంటే త్వరగానే కోలుకున్న స్టార్ వికెట్ కీపర్..
రిషబ్ పంత్ వచ్చేస్తున్నాడు. ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇండియ ఎ టీమ్ కెప్టెన్ గా మళ్లీ ఫీల్డ్ లో అడుగుపెడుతున్నాడు. సుమారు మూడు నెలల తర్వాత అతడు మళ్లీ గాయం నుంచి కోలుకొని ఆడబోతున్నట్లు బీసీసీఐ మంగళవారం (అక్టోబర్ 21) వెల్లడించింది.
రిషబ్ పంత్ ఫ్యాన్స్ అందిరికి గుడ్ న్యూస్ చెప్పింది బీసీసీఐ. ఈ వికెట్ కీపర్ బ్యాటర్ త్వరలో తిరిగి రాబోతున్నాడు. అన్ని ఫార్మాట్‌లలో టీమిండియాకు ప్రధాన వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్.. జులైలో మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టెస్టులో కాలు విరగ్గొట్టుకున్న విషయం తెలిసిందే. ఆ గాయం నుంచి కోలుకున్న పంత్.. అక్టోబర్ 30 నుంచి సౌతాఫ్రికా ఎ జట్టుతో జరగబోయే రెండు నాలుగురోజుల మ్యాచ్‌లకు ఇండియా ఎ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.

రిషబ్ పంత్ ఈజ్ బ్యాక్
ఇండియా, సౌతాఫ్రికా మధ్య వచ్చే నెల 14 నుంచి తొలి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్టులు ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ఈ మ్యాచ్ లలో రిషబ్ పంత్ తనను తాను నిరూపించుకుంటే మళ్లీ టీమిండియాలోకి అడుగుపెడతాడు. ఇక పంత్ రెండు వేర్వేరు స్క్వాడ్‌లను నడిపించనున్నాడు.
మొదటి నాలుగు రోజుల మ్యాచ్ బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో సాయి సుదర్శన్, ఎన్. జగదీసన్, దేవదత్ పడిక్కల్, రజత్ పటీదార్ వంటి ఆటగాళ్లు పంత్ సారథ్యంలో ఆడనున్నారు. ఇక రెండో నాలుగు రోజుల మ్యాచ్ నవంబర్ 6న అదే వేదికలో జరుగుతుంది. ఇందులో కేఎల్ రాహుల్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ వంటి నలుగురు ఇంగ్లాండ్‌లో ఆడిన ఆటగాళ్లు కూడా ఈ స్క్వాడ్‌లో ఉన్నారు.
రిషబ్ పంత్ గాయం, రికవరీ
ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టెస్టులో క్రిస్ వోక్స్ వేసిన యార్కర్‌కు పంత్ గాయపడ్డాడు. వెంటనే అతన్ని అంబులెన్స్‌లో తీసుకెళ్లారు. కాలు విరిగినప్పటికీ పంత్ తిరిగి బ్యాటింగ్‌కు వచ్చి పోరాడి హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ ఇన్నింగ్స్ టీమ్ స్కోర్‌ను పెంచడంలో కీలకమైంది. అయితే గాయం తీవ్రత వల్ల పంత్ ఆ సిరీస్‌లోని చివరి టెస్టుతో పాటు, ఆసియా కప్, స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్, ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న పర్యటనకు కూడా దూరంగా వచ్చింది.
ఇప్పుడు పంత్ తిరిగి వస్తుండడంతో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగబోయే రెండు టెస్ట్ మ్యాచ్‌లకు అతను కచ్చితంగా టీమ్ లో ఉండే అవకాశం ఉంది. గత నెల రోజుల నుంచి తన కాలుకు ప్లాస్టర్ వేసిన ఫోటోలను, స్టోరీలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. కోలుకోవడం ఆలస్యం అవుతోందని పంత్ నిరాశ వ్యక్తం చేశాడు. కానీ అతని పట్టుదల, బీసీసీఐ పర్యవేక్షణలో చేసిన ప్రత్యేక రిహాబ్ ప్రయత్నాలు ఇప్పుడు ఫలించాయి.
పంత్ త్వరగా పూర్తి ఫామ్‌లోకి వచ్చి ఇంగ్లాండ్‌పై చూపించిన ఆటతీరును మళ్లీ కొనసాగించాలని భారత్ ఆశిస్తోంది. లీడ్స్‌లో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ సెంచరీలు చేసిన పంత్.. తర్వాతి మూడు టెస్టుల్లో (బర్మింగ్‌హామ్, లార్డ్స్, మాంచెస్టర్) ఒక్కొక్క హాఫ్ సెంచరీలు చేశాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


