ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ 2026- ఖాళీలు, వయస్సు పరిమితి, ముఖ్యమైన తేదీల వివరాలు..

RRB NTPC UG 2026 రిక్రూట్​మెంట్​లో భాగంగా 3,058 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Oct 31, 2025, 05:42:17 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (యూజీ) రిక్రూట్‌మెంట్ 2026 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇటీవలే ప్రారంభించాయి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (ఆర్​ఆర్బీలు). ఈ పోస్టులకు రిజిస్టర్​ చేసుకోవడానికి ఆసక్తి, అర్హత కలగిన అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా తమ దరఖాస్తులను సమర్పించవచ్చు.

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ 2026 ..
ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​ 2026 ..

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్​కి సంబంధించిన విండో నవంబర్ 27, 2025 వరకు తెరిచి ఉంటుంది.

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్- ముఖ్యమైన తేదీలు..

దరఖాస్తు ఫీజు చెల్లింపునకు చివరి తేదీ- నవంబర్ 29, 2025

అప్లికేషన్​ కరెక్షన్​ విండో- నవంబర్ 30, 2025 నుంచి డిసెంబర్ 9, 2025 వరకు

అర్హులైన అభ్యర్థులు రైటర్‌ వివరాలను సమర్పించడానికి- డిసెంబర్ 10 నుంచి 14, 2025 వరకు

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్- ఖాళీల వివరాలు..

రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు మొత్తం 3,058 ఖాళీలను భర్తీ చేయనున్నాయి. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:

కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్: 2,424 పోస్టులు

అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 394 పోస్టులు

జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్: 163 పోస్టులు

ట్రైన్స్ క్లర్క్: 77 పోస్టులు

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్- వయో పరిమితి, ఎంపిక ప్రక్రియ..

వయో పరిమితి:

జనవరి 1, 2026 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయస్సులో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

రైల్వే ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రధానంగా నాలుగు దశల్లో జరుగుతుంది:

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ 1)

కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ 2)

కంప్యూటర్ ఆధారిత టైపింగ్ స్కిల్ టెస్ట్ (సీబీటీటీఎస్​టీ)

డాక్యుమెంట్ వెరిఫికేషన్/వైద్య పరీక్ష (వైద్య పరీక్షలు)

రైల్వే బోర్డు (ఆర్​ఆర్బీలు) ఈ అన్ని కార్యకలాపాలకు సంబంధించిన తేదీ, సమయం, వేదికను నిర్ణయించి, తగిన సమయంలో అర్హులైన అభ్యర్థులకు తెలియజేస్తుంది.

ఆర్​ఆర్బీ ఎన్టీపీసీ యూజీ రిక్రూట్​మెంట్- సీబీటీ 1 పరీక్ష వివరాలు..

సీబీటీ 1 పరీక్ష స్క్రీనింగ్ స్వభావం కలది. ఇందులో మొత్తం 100 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం 90 నిమిషాలు (రైటర్‌ను ఉపయోగించుకునే అభ్యర్థులకు 120 నిమిషాలు). ఈ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

సీబీటీ 1లో అర్హత సాధించిన అభ్యర్థులను సీబీటీ 2 కోసం షార్ట్‌లిస్ట్ చేస్తారు.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More