ఈ రోజు స్టాక్ మార్కెట్లకు భారీ లాభాలు- ఈ స్టాక్స్‌లో ట్రేడ్‌తో ప్రాఫిట్స్..!
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. గిఫ్టీ నిఫ్టీ వాల్యూతో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
దీపావళి బలిప్రద సందర్భంగా దేశీయ స్టాక్ మార్కెట్లకు బుధవారం సెలవు. ఇక మంగళవారం జరిగిన ముహురత్ ట్రేడింగ్ సెషన్లో సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 62 పెరిగి 84,426 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 25 పాయింట్లు వృద్ధిచెంది 25,868 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 26 పాయింట్లు పడి 58,007 వద్దకు చేరింది.

ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌పై సానుకూల వాతావరణం నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 375 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50తో పాటు మార్కెట్ సెంటిమెంట్ బుల్లిష్‌గా ఉంది. స్వల్పకాలంలో సూచీ 26,000-26,200 వరకు వెళ్లొచ్చు. 25,700 వద్ద కీలక సపోర్ట్ ఉంది,” అని ఎల్కేపీ సెక్యూరిటీస్ సీనియర్ టెక్నికల్ ఎనలిస్ట్ రూపక్ దే తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
బుధవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.71 శాతం పతనమైంది. ఎస్ అండ్ పీ 500 0.53శాతం పడింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.93 శాతం డౌన్ అయ్యింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
గోదావరి పవర్ అండ్ ఇస్పాట్ లిమిటెడ్- బై రూ. 252.35, స్టాప్ లాస్ రూ. 240, టార్గెట్ రూ. 275
నేషనల్ అల్యుమీనియం కంపెనీ (నాల్కో)- బై రూ. 226.03, స్టాప్ లాస్ రూ. 215, టార్గెట్ రూ. 245
ఐఈఎక్స్- బై రూ. 138, స్టాప్ లాస్ రూ. 132, టార్గెట్ రూ. 146
హౌజింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (హుడ్కో)- బై రూ. 229, స్టాప్ లాస్ రూ. 223, టార్గెట్ రూ. 240
ఇన్ఫోసిస్- బై రూ. 1461, స్టాప్ లాస్ రూ. 1420, టార్గెట్ రూ. 1520
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


