ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి- ఈ రోజు స్టాక్ మార్కెట్‌కి భారీ నష్టాలు తప్పవా?
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇజ్రాయెల్- ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 823 పాయింట్లు పడి 81,692 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 253 పాయింట్లు పతనమై 24,888 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 377 పాయింట్లు పడి 56,082 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
గురువారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 3,831.42 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,393.85 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని భారీ నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 200 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.
శుక్రవారం తెల్లవారుజామున ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరాయి. ఇరాన్ ప్రతిఘటిస్తుందనే అంచనాలు ఉన్నాయి.
ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య తాజా పరిణామాల మధ్య ముడి చమురు దాదాపు 8శాతం పెరిగి బ్యారెల్‌కి 74.68 డాలర్లకు చేరింది. ఇది రెడు నెలల గరిష్ఠం!
నిఫ్టీ 50 సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్..
“నిఫ్టీ50కి తక్షణ సపోర్ట్ 24,750 దగ్గర ఉంది. ఆ తర్వాత 24,500. 25,000- 25,050 వద్ద రెసిస్టెన్స్ ఉంది. అది దాటలేకపోతే అమ్మకాల ఒత్తిడి కనిపించొచ్చు,” అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్ నదీష్ షా తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
గురువారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 0.24 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 0.38శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 0.24 శాతం పెరిగింది.
కాగా ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి నేపథ్యంలో ఫ్యూచర్స్ నష్టాల్లో కొనసాగుతున్నాయి.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో నష్టాల్లో కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
సుబ్రోస్ లిమిటెడ్- బై రూ. 859, స్టాప్ లాస్ రూ. 825, టార్గెట్ రూ. 920
కృష్ణన ఫోస్కెమ్- బై రూ. 490.05, స్టాప్ లాస్ రూ. 470, టార్గెట్ రూ. 525
విజయ డయగ్నాస్టిక్ సెంటర్- బై రూ. 960, స్టాప్ లాస్ రూ. 945, టార్గెట్ రూ. 995
అరవింద్ ఫ్యాషన్- బై రూ. 483, స్టాప్ లాస్ రూ. 520, టార్గెట్ రూ. 474
ఇండియన్ బ్యాంక్- బై రూ. 625, స్టాప్ లాస్ రూ. 615, టార్గెట్ రూ. 645
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper













