ట్రేడర్స్ అలర్ట్- ఈ 10 స్టాక్స్‌లో ట్రేడ్‌తో లాభాలకు ఛాన్స్!
ట్రేడర్లు నేడు ట్రాక్ చేయాల్సిన స్టాక్స్ టు బై, బ్రేకౌట్ స్టాక్స్ టు బై లిస్ట్‌ని నిపుణులు వెల్లడించారు. వీటితో పాటు లేటెస్ట్ స్టాక్ మార్కెట్ అప్డేట్స్ని ఇక్కడ తెలుసుకోండి..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 178 పాయింట్లు పడి 82,327 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 58 పాయింట్లు కోల్పోయి 25227 వద్ద సెషన్‌ని ముగించింది. ఇక బ్యాంక్ నిఫ్టీ మాత్రం 15 పాయింట్లు పెరిగి 56,625 వద్దకు చేరింది.

ఎఫ్ఐఐలు.. డీఐఐలు..
సోమవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 240.1 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. అదే సమయంలో డీఐఐలు రూ. 2,333.42 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈ అక్టోబర్ నెలలో ఎఫ్ఐఐలు ఇప్పటివరకు మొత్తం మీద రూ. 453.14 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 14,130.43 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు.
ఈరోజు స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతోంది?
ఇక మంగళవారం ట్రేడింగ్ సెషన్‌ని స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 5 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
“నిఫ్టీ50లో స్వల్ప ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. 25,050 లెవల్ కన్నా పైన ఉన్నంత వరకు సూచీ పాజిటివ్‌గానే ఉన్నట్టు అర్తం చేసుకోవచ్చు. 25,300 ఎగువన ఉండగలిగితే నిఫ్టీ50 25,400 వరకు వెళ్లొచ్చు,” అని సెంట్రమ్ బ్రోకింగ్ టెక్నికల్ అండ్ డెరివేటివ్స్ రీసెర్చ్ ఎనలిస్ట్ నీలేశ్ జైన్ తెలిపారు.
అమెరికా స్టాక్ మార్కెట్లు..
సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని అమెరికా స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్ 1.29 శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 1.59శాతం వృద్ధిచెందింది. టెక్ ఇండెక్స్ నాస్డాక్ 2.21 శాతం పెరిగింది.
ఆసియా స్టాక్ మార్కెట్లు మంగళవారం ట్రేడింగ్ సెషన్లో ఫ్లాట్‌గా కొనసాగుతున్నాయి.
స్టాక్స్ టు బై..
ఎల్ అండ్ టీ ఫైనాన్స్- బై రూ. 266.6, స్టాప్ లాస్ రూ. 257, టార్గెట్ రూ. 286
ఫోర్టిస్ హెల్త్‌కేర్- బై రూ. 1095, స్టాప్ లాస్ రూ. 1057, టార్గెట్ రూ. 1171
మహీంద్రా అండ్ మహీంద్రా- బై రూ. 3460, స్టాప్ లాస్ రూ. 3400, టార్గెట్ రూ. 3600
గోద్రేజ్ ప్రాపర్టీస్- బై రూ. 2095, స్టాప్ లాస్ రూ. 2030, టార్గెట్ రూ. 2200
బర్జర్ పెయింట్స్- బై రూ. 534, స్టాప్ లాస్ రూ. 520, టార్గెట్ రూ. 560
బ్రేకౌట్ స్టాక్స్ టు బై..
స్వరాజ్ ఇంజిన్స్: రూ .4360 వద్ద కొనండి, టార్గెట్ రూ .4685, స్టాప్ లాస్ రూ .4200;
సిర్కా పెయింట్స్ ఇండియా: రూ.501, టార్గెట్ రూ.540, స్టాప్ లాస్ రూ.483;
కృష్ణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్: రూ .713 వద్ద కొనండి, లక్ష్యం రూ .770, స్టాప్ లాస్ రూ .688;
ఫినో పేమెంట్స్ బ్యాంక్: రూ .313 వద్ద కొనండి, లక్ష్యం రూ .336, స్టాప్ లాస్ రూ .300;
హెచ్‌బీఎల్ ఇంజినీరింగ్: రూ.917 వద్ద కొనండి, టార్గెట్ రూ.990, స్టాప్ లాస్ రూ.885
(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్ టైమ్స్ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్ ఉండటం శ్రేయస్కరం.)
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper


