ట్రేడర్స్​ అలర్ట్​- ఇన్ఫోసిస్​, ఐసీఐసీ బ్యాంక్​ స్టాక్స్​కి టైమ్​ వచ్చింది! షేర్​ ప్రైజ్​ టార్గెట్స్​ ఇవే..

ట్రేడర్లు నేడు ట్రాక్​ చేయాల్సిన స్టాక్స్​ టు బై లిస్ట్​ని నిపుణులు వెల్లడించారు. వీటిల్లో బ్రేకౌట్​ స్టాక్స్​ కూడా ఉన్నాయి. వీటితో పాటు లేటెస్ట్​ స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​ వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

Published on: Jun 9, 2025, 07:22:42 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 747 పాయింట్లు పెరిగి 82,189 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 252 పాయింట్లు వృద్ధిచెంది 25,003 వద్ద సెషన్​ని ముగించింది. బ్యాంక్​ నిఫ్టీ 818 పాయింట్లు పెరిగి 56,578 వద్దకు చేరింది.

స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, స్టాక్స్​ టు బై లిస్ట్​..
స్టాక్​ మార్కెట్​ అప్డేట్స్​, స్టాక్స్​ టు బై లిస్ట్​..

ఎఫ్​ఐఐలు.. డీఐఐలు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ. 1,009.71 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 9,342.48 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.

ఈరోజు స్టాక్​ మార్కెట్​ ఎలా ఉండబోతోంది?

ఇక దేశీయ స్టాక్​ మార్కెట్​లు.. సోమవారం ట్రేడింగ్​ సెషన్​ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్​ నిఫ్టీ దాదాపు 70 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.

“నిఫ్టీ50కి 24,800 లెవల్స్​ వద్ద 20 డే ఎస్​ఎంఏ ఉంది. దీని పైన ఉన్నంత కాలం సూచీ పాజిటివ్​గా ఉన్నట్టు అర్థం. 25,100 లెవల్స్​ వద్ద రెసిస్టెన్స్​ ఉంది. అది దాటితే సూచీ 25,400- 25,500 వరకు వెళ్లొచ్చు. కానీ 24,800 కన్నా కిందకు పడితే.. నిఫ్టీ50 24,500 వరకు వెళ్లొచ్చు,” అని కొటక్​ సెక్యూరిటీస్​ వీపీ- టెక్నికల్​ రీసెర్చ్​ అమోల్​ అథవాలే తెలిపారు.

అమెరికా స్టాక్​ మార్కెట్​లు..

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని అమెరికా స్టాక్ మార్కెట్​లు భారీ లాభాల్లో ముగించాయి. డౌ జోన్స్​ 1.05 శాతం పెరిగింది. ఎస్​ అండ్​ పీ 500​ 1.03శాతం వృద్ధిచెందింది. టెక్​ ఇండెక్స్​ నాస్​డాక్ 1.20 శాతం పెరిగింది.

యూఎస్​ జాబ్స్​ డేటా అనుకున్న దాని కన్నా మెరుగ్గా రావడం ఈ లాభాలకు కారణం.

ఆసియా స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో లాభాల్లో కొనసాగుతున్నాయి.

స్టాక్స్​ టు బై..

ఇన్ఫోసిస్​- బై రూ. 1568, స్టాప్​ లాస్​ రూ. 1515, టార్గెట్​ రూ. 1660

ఐసీఐసీఐ బ్యాంక్​- బై రూ. 1460, స్టాప్​ లాస్​ రూ. 1400, టార్గెట్​ రూ. 1575

సీఈఎస్​సీ- బై రూ. 168, స్టాప్​ లాస్​ రూ. 160, టార్గెట్​ రూ. 183

బజాజ్​ ఫిన్​సర్వ్​- బై రూ. 1992, స్టాప్​ లాస్​ రూ. 1950, టార్గెట్​ రూ. 2100

బీహెచ్​ఈఎల్​- బై రూ. 255, స్టాప్​ లాస్​ రూ. 250, టార్గెట్​ రూ. 267

బ్రేకౌట్​ స్టాక్స్​ టు బై..

గో డిజిట్ జనరల్ ఇన్సూరెన్స్: రూ.351.25 వద్ద కొనండి, టార్గెట్ రూ.385, స్టాప్ లాస్ రూ.334;

గోద్రెజ్ ప్రాపర్టీస్: రూ.2467 వద్ద కొనండి, టార్గెట్ రూ.2720, స్టాప్ లాస్ రూ.2340;

ఆదిత్య బిర్లా రియల్ ఎస్టేట్: రూ .2355.80 వద్ద కొనండి, టార్గెట్ రూ .2600, స్టాప్ లాస్ రూ .2240;

గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్: రూ.401.05 వద్ద కొనుగోలు, టార్గెట్ రూ.440, స్టాప్ లాస్ రూ.380;

యూటీఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ: రూ .1223.90 వద్ద కొనుగోలు చేయండి, టార్గెట్ రూ .1360, స్టాప్ లాస్ రూ .1160.

(గమనిక:- ఇవి నిపుణుల అభిప్రాయాలు మాత్రమే. హిందుస్థాన్​ టైమ్స్​ తెలుగుకు ఎలాంటి సంబంధం లేదు. ఏదైనా ట్రేడ్​ తీసుకునే ముందు ట్రేడర్లకు సొంతంగా ఎనాలసిస్​ ఉండటం శ్రేయస్కరం.)

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More