Ind vs WI: గిల్ రికార్డు డబుల్ సెంచరీ.. రోహిత్ సెంచరీ.. వన్డేల్లో టీమిండియా సరికొత్త చరిత్ర.. అలవోకగా 406 రన్స్ చేజ్
Ind vs WI: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రికార్డు డబుల్ సెంచరీ చేసిన వేళ టీమిండియా వన్డేల్లో అత్యధిక పరుగుల చేజింగ్ రికార్డును సాధించింది. వెస్టిండీస్ తో జరిగిన రెండో వన్డేలో ఏకంగా 406 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం విశేషం.
Ind vs WI: వన్డే క్రికెట్ లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఛేజింగ్ లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాటర్ గా, అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన ప్లేయర్ గా రికార్డు క్రియేట్ చేశాడు. అదే సమయంలో ఇండియన్ టీమ్ వన్డే ఫార్మాట్ లో అత్యధిక పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

వెస్టిండీస్ పై రెండో వన్డేలో 406 రన్స్ టార్గెట్ ను కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి మరో 6.3 ఓవర్లు మిగిలి ఉండగానే చేజ్ చేయడం విశేషం. రోహిత్ శర్మ కూడా సెంచరీ చేయగా.. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు ఏకంగా 255 రన్స్ జోడించారు. గిల్ చివరికి 133 బంతుల్లో 26 ఫోర్లు, 8 సిక్స్ లతో 223 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. వన్డే క్రికెట్ చరిత్రలో 2006లో సౌతాఫ్రికా చేజ్ చేసిన 438 రన్స్ తర్వాత రెండో అత్యధిక చేజింగ్ కూడా ఇదే.
గిల్.. రికార్డుల మోత
వెస్టిండీస్ తో తొలి వన్డేలోనూ సెంచరీ చేసిన గిల్.. రెండో మ్యాచ్ లో మరింత చెలరేగిపోయాడు. ఈసారి వన్డే క్రికెట్ లో రెండో డబుల్ సెంచరీ సాధించాడు. వన్డేల్లో తొలి, రెండో ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీలు చేసిన తొలి బ్యాటర్ గా చరిత్ర సృష్టించాడు. అంతకుముందు 2023లో న్యూజిలాండ్ పై హైదరాబాద్ లో జరిగిన వన్డేలోనూ గిల్ డబుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే.
అంతేకాదు కేవలం 117 బంతుల్లోనే డబుల్ సెంచరీ చేసి అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన బ్యాటర్ గా నిలిచాడు. అతని దూకుడుతో విండీస్ టీమ్ ఇండియా ముందు ఉంచిన 406 పరుగుల కొండంత లక్ష్యం కూడా చిన్నబోయింది.
రోహిత్ శర్మ సెంచరీ
మరో ఓపెనర్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా సెంచరీ చేసి 40 ఏళ్ల వయసులోనూ తనలో ఏమాత్రం సత్తా తగ్గలేదని నిరూపించాడు. తొలి వన్డేలో నిరాశ పరిచిన హిట్ మ్యాన్.. ఈ మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. కేవలం 75 బంతుల్లో 10 ఫోర్లు, 6 సిక్స్ లతో 101 రన్స్ చేసి ఔటయ్యాడు.
గిల్ తో కలిసి తొలి వికెట్ కు 255 రన్స్ జోడించాడు. గతంలో సచిన్, గంగూలీ కలిసి తొలి వికెట్ కు జోడించిన 258 రన్స్ రికార్డు పార్ట్‌నర్‌షిప్ కు చేరువగా వచ్చారు. ఆ సమయంలో రోహిత్ ఎల్బీడబ్ల్యూగా ఔటయ్యాడు. ఈ క్రమంలో వన్డేల్లో రోహిత్ 12 వేల పరుగుల మైలురాయిని కూడా దాటాడు.
ABOUT THE AUTHORHari Prasad Sహరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.Read More

E-Paper


