అలర్ట్​! తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు- ఇదీ కారణం..

బోనాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో, తెలంగాణవ్యాప్తంగా బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఈ నెలలో మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..

Published on: Jul 21, 2025, 06:02:01 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బ్యాంకు పనుల కోసం తిరిగే వారికి అలర్ట్​! తెలంగాణలో నేడు, జులై 21 అన్ని బ్యాంకులకు సెలవు. బోనాల నేపథ్యంలో జులై 21ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం ఇందుకు కారణం. ఈ రోజు బ్యాంకులతో పాటు స్కూళ్లు, కాలేజీలు సైతం మూతపడి ఉంటాయి.

తెలంగాణ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్​! (REUTERS)
తెలంగాణ బ్యాంకు కస్టమర్లకు అలర్ట్​! (REUTERS)

బోనాల వేళ తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు..

దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ (రిజర్వ్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా) జారీ చేస్తుంది. అయితే వీటిల్లో ప్రాంతీయ పండుగల వేళ ఆయా ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు, జులై 21న బోనాల కారణంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

ఇక జులై 20 ఆదివారం వచ్చింది. ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంటే, తెలంగాణలో బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు లభించాయి.

తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఇక హైదరాబాద్​లోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

తెలంగాణ బ్యాంకు సెలవులు..

ఈ నెలలో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులు ఇంకో రెండు రోజులు మూతపడి ఉంటాయి. జులై 26 నాలుగో శనివారం వచ్చింది. జులై 27 ఆదివారం వచ్చింది. వారంతంలో బ్యాంకులు మూతపడి ఉంటాయని కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది.

ఆన్​లైన్​ సేవలు యథాతథంగా పనిచేస్తాయి..

బ్యాంకులకు సెలవుఉన్నప్పటికీ ఆన్​లైన్​ సేవలు యథాతథంగా పనిచేస్తుంటాయి. నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర హాలీడేలతో ఎలాంటి సంబంధం లేకుండా వారి ఆన్​లైన్ వెబ్​సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచుతాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంకైనా వెళ్లొచ్చు.

తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకులు తిరిగి యథాతథంగా పనిచేస్తాయి. మీరు మీ బ్యాంకు పనుల కోసం సంబంధిత బ్రాంచీలకు వెళ్లొచ్చు.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More