రేపు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - ఈ లింక్స్ తో చెక్ చేసుకోవచ్చు

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు రానున్నాయి. సోమవారం (జూన్ 16) మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. https://tgbie.cag.gov.in వెబ్ సైట్ ద్వారా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

Published on: Jun 15, 2025 5:38 PM IST
By , , Telangana, Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల కానున్నాయి. సోమవారం(జూన్ 16) మధ్యాహ్నం 12 గంటలకు రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఫలితాలను https://tgbie.cag.gov.in లేదా http://results.cgg.gov.in వెబ్ సైట్ ద్వారా చెక్ చేసుకోవచ్చని అధికారులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు.

తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు

మే 22 నుంచి 29 వరకు తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీపరీక్షలు జరిగాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి మొత్తం 4.2 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్ రాశారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. మూల్యాంకనంతో పాటు సాంకేతిక అంశాల పరిశీలన పూర్తి కావటంతో… సోమవారం ఫలితాలను ప్రకటించనున్నారు.

టీజీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోవాలి:

  1. పరీక్ష రాసిన విద్యార్థులు https://tgbie.cag.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల లింక్ పై క్లిక్ చేయాలి.
  3. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషనల్ కోర్సుల ఆప్షన్లు కనిపిస్తాయి.
  4. ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ను ఎంట్రీ చేసి సబ్మిట్ చేయాలి.
  5. మీ స్కోర్ డిస్ ప్లే అవుతుంది. ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్స్ కాపీని పొందవచ్చు.

మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి ప్రకటన వెలువడనుంది. ఇప్పటికే ఈఏపీసెట్ఫలితాలు విడుదల కాగా…కౌన్సెలింగ్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,51,779 మంది విద్యార్థులు క్వాలిఫై కాగా…. అగ్రికల్చర్-ఫార్మా విభాగంలో 71,309 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

జూలై మొదటి వారంలో ఇంజినీరింగ్కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ర్యాంకులు, రిజర్వేషన్లు ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. ఈసారి అగస్టు 14లోపు సీట్ల భర్తీ ప్రక్రియను పూర్తి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More