తెలంగాణలో కొనసాగుతున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ అడ్మిషన్లు - చివరి తేదీ ఇదే

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగియగా… రెండో విడత ప్రవేశాలపై ఇంటర్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. జూలై 31వ తేదీతో గడువు ముగియనుంది.

Published on: Jun 28, 2025 11:02 AM IST
By , , Telangana, Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రాష్ట్రంలో అన్ని రకాల జూనియర్‌ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ప్రవేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే మొదటి విడత అడ్మిషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో రెండో విడత ప్రవేశాలపై ఇంటర్ బోర్డు కీలక ప్రకటన చేసింది. జులై 31వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కోర్సుల్లో చేరవచ్చని తెలిపింది.

తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లు 2025
తెలంగాణ ఇంటర్ అడ్మిషన్లు 2025

జూలై 30 వరకు గడువు….

ఈ విద్యా సంవత్సరానికి సంంబధించిన తొలి విడత ప్రవేశాలు మే 1 నుంచి ప్రారంభమయ్యాయి. ఈ గడువు జూన్ 30వ తేదీతో ముగియనుంది. ఈ క్రమంలో రెండో విడత ప్రవేశాలకు ఇంటర్మీడియట్బోర్డు ప్రకటన విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు…జూలై 31వ తేదీ వరకు అడ్మిషన్లు తీసుకోవచ్చని పేర్కొంది. ఆ తర్వాత ప్రవేశాలకు అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం (ఇంటర్ ఫస్ట్ ఇయర్) తరగతులు జూన్ 2, 2025 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే తాజాగానే తెలంగాణ టెన్త్ సప్లిమెంటరీఫలితాలు కూడా విడుదలయ్యాయి. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు ఇంటర్ కోర్సుల్లో అడ్మిషన్లు తీసుకోనున్నారు.

మరోవైపు ఇంటర్మీడియట్బోర్డు గుర్తింపు ఉన్న కాలేజీల్లోనే విద్యార్థులు చేరాలని ఇంటర్ బోర్డు అధికారులు స్పష్టం చేస్తున్నారు. గుర్తింపు పొందిన కాలేజీల జాబితాను కూడా బోర్డు అధికారిక వెబ్ సైట్ టీఎస్‌బీఐఈ లో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంటున్నారు. ఇక విద్యార్థుల ఆధార్‌ నెంబర్‌ తప్పకుండా నమోదు చేయటంతో పాటు... అడ్మిషన్ల వివరాలను ప్రతీ రోజూ కాలేజీ బోర్డుపై ఉంచాల్సి ఉంటుంది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More