...
...
Next Story

ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్ల అప్డేట్ - దరఖాస్తుల గడువు పొడిగింపు, ఇదిగో లింక్

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (TOSS)లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాలు పొందవచ్చు. జూలై 31వ తేదీ వరకు గడువు పొడిగించారు. ఆ తర్వాత ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుంది.

Published on: Jul 13, 2025, 11:29:05 IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీలో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థుల నుంచి ఓపెన్ టెన్త్, ఇంటర్ లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన దరఖాస్తుల గడువు ముగియగా.. అధికారులు మరోసారి పొడిగించారు. జూలై 31వ తేదీ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చని సూచించారు.

తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ప్రవేశాలు 2025
తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ప్రవేశాలు 2025

వివిధ కారణాల రీత్యా రెగ్యూలర్ విధానంలో టెన్స్, ఇంటర్ చదవలేనివారి కోసం టాస్ ద్వారా అడ్మిషన్లు కల్పిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరానికి గాను(2025-26) 10వ తరగతి, ఇంటర్‌లో ప్రవేశాలు పొందుతారు. పూర్తి వివరాలను https://www.telanganaopenschool.org/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

ఫైన్ తో ఆగస్టు 28 వరకు గడువు…

ఆలస్య రుసుంతో ఆగస్టు 1 నుంచి 28 వరకు ప్రవేశాలు పొందవచ్చు. పదో తరగతిలో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండి ఉండాలి. ఇక ఇంటర్ లో ప్రవేశం పొందేందుకు ఆగస్టు 31 నాటికి 15 ఏళ్లు నిండి ఉండాలి.తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మీడియం కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఆధార్ , మొబైల్ నెంబర్ కరెక్ట్ గా నమోదు చేసుకోవాలి. https://www.telanganaopenschool.org/ లింక్ పై క్లిక్ చేసి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు. స్టడీ సెంటర్లను సరిగా చూసి ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.

అడ్మిషన్ కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నఅప్లికేషన్ ఫామ్ ను స్టడీ సెంటర్లలో సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే అడ్మిషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి నేరుగా ఓటీపీ ఆధారిత రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe