తెలంగాణ ఓపెన్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల - మీ మార్కులను ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ ఓపెన్ టెన్త్ - 2025 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు… www.telanganaopenschool.org వెబ్ సైట్ లోకి వెళ్లి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. మరోవైపు ఇంటర్ ఫలితాలు కూడా వచ్చాయి.

Published on: Jun 7, 2025, 13:06:34 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌) పదో తరగతి పరీక్షల ఫలితాలు వచ్చేశాయ్. ఏప్రిల్, మే మధ్యలో ఈ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలు రాసిన విద్యార్థులు… టాస్ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

తెలంగాణ ఓపెన్ టెన్త్ వివరాలు
తెలంగాణ ఓపెన్ టెన్త్ వివరాలు

టీజీ ఓపెన్ టెన్త్ ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

  • విద్యార్థులు ముందుగా https://www.telanganaopenschool.org వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోంపేజీలో కనిపించే రిజల్ట్స్ సెక్షన్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ ఓపెన్ టెన్త్ రిజల్స్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇక్కడ విద్యార్థి అడ్మిషన్ లేదా రూల్ నెంబర్ ఎంట్రీ చేయాలి.
  • సబ్మిట్ చేస్తే ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
  • ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేసి మార్కుల కాపీని పొందవచ్చు.

ఈసారి మొత్తం 28,547 మంది అభ్యర్థులు ఓపెన్ టెన్త్ పరీక్షలు రాయగా, 16,443 (57.80) శాతం ఉత్తీర్ణత సాధించారు. మార్కుల రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈ నెల 12 నుంచి 18 వరకు ఫీజు చెల్లించుకోవచ్చు.

ఓపెన్ ఇంటర్ ఫలితాలు విడుదల:

మరోవైపు తెలంగాణ ఓపెన్ ఇంటర్ఫలితాలు కూడా విడుదలయ్యాయి. పరీక్ష రాసిన విద్యార్థులు టాస్ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు. అడ్మిషన్ నెంబర్ లేదా రూల్ నెంబర్ ఎంట్రీ చేసి స్కోర్ వివరాలను పొందవచ్చని అధికారులు సూచించారు. ఈసారి మొత్తం 41,051మంది అభ్యర్థులు పరీక్షలు రాయగా…24,538 మంది పాస్ అయ్యారు.

ఈనెల 12న కొత్త నోటిఫికేషన్:

తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం(టాస్‌)లో టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు కొత్త నోటిఫికేషన్ రానుంది. ఇందుకు అధికారులు ముహుర్తం ఖరారు చేశారు. జూన్ 12వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని తెలిపారు. ఇదే రోజు నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు షురూ అవుతాయి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 12 వరకు మీసేవా ద్వారా అప్లికేషన్ చేసుకోవచ్చు.

తెలంగాణ ఓపెన్ టెన్త్ ఫలితాల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి

తెలంగాణ ఓపెన్ ఇంటర్ రిజల్ట్ కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More