తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్‌మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. https://tgpolycet.nic.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియపై కీలక ప్రకటన వచ్చేసింది. ఎట్టకేలకు ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ మేరకు సీట్లు పొందిన విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి అలాట్ మెంట్ అర్డర్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.

పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా…. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో సీట్లను కేటాయించారు. ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన విద్యార్థులు… ఇవాళ్టి నుంచే ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఇందుకు జూలై 18వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
అలాట్‌మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- అభ్యర్థులు https://tgpolycet.nic.in/Default.aspx వెబ్ సైట్లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే క్యాండెట్ లాగిన్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా కాపీని పొందవచ్చు.
జూలై 18వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. https://tgpolycet.nic.in/cand_signin.aspx వెబ్ సైట్ లేదా సాంకేతిక విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.
జూలై 23 నుంచి రెండో విడత కౌన్సెలింగ్….
పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 23 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 24వ తేదీ నుంచి 25 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. జూలై 25వ తేదీలోపు అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 31వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.
ఈ ఏడాది జరిగిన పాలిసెట్పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కొత్తగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది.ఈసారి మొత్తం 28,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ లింక్ పై క్లిక్ చేసి పాలిసెట్ అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper












