విద్యార్థులకు అలర్ట్ - నేటి నుంచి తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్, ముఖ్య తేదీలివే
ఇవాళ్టి నుంచి టీజీ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 28వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలనకు కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
తెలంగాణ పాలిసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే సాంకేతి విద్యాశాఖ షెడ్యూల్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా… నేటి నుంచి జూన్ 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు….
పాలిసెట్ ర్యాంక్ ఆధారంగా…. ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలను కల్పించనున్నారు. మొత్తం 2 విడతల్లో కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
జూన్ 26 నుంచి జూన్ 29 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఇక జూలై 1వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. జులై 4వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది. జూలై 4 నుంచి 6వ తేదీ వరకు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోవాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేసుకోకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు. polycet.sbtet.telangana.gov.in వెబ్ సైట్ లేదా సాంకేతిక విద్యాశాఖ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లి వివరాలను తెలుసుకోవచ్చు.
పాలిటెక్నిక్‌లో 100 శాతం సీట్లను కన్వీనర్ కోటా కిందే భర్తీ చేస్తారు. వాటిల్లో అత్యధికంగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో 6,703 సీట్లు ఉన్నాయి. ఇక ఈఈఈలో 5,850, ఈసీఈలో 5,783, మెకానికల్‌లో 4,008, సివిల్‌లో 3,929 సీట్లున్నట్లు అధికారులు ప్రకటించారు.
జూలై 9 తుది కౌన్సెలింగ్:
పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ జూలై 9 నుంచి ప్రారంభమవుతుంది. జూలై 11వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. జూలై 11వ తేదీ నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. జూలై 15వ తేదీన అభ్యర్థులకు సీట్లు కేటాయింపు ఉంటుంది. జూలై 18వ తేదీ నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయి.
ఈ ఏడాది జరిగిన పాలిసెట్పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరంతా కూడా కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా రిజిస్ట్రేషన్లు చేసుకుని… సీట్లు పొందాల్సి ఉంటుంది. ఈసారి కొత్తగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది.ఈసారి మొత్తం 28,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


