తెలంగాణ పాలిసెట్ - 2025 ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు పూర్తి కాగా.. ఈనెల 23వ తేదీ నుంచి ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభవుతుంది. ఎంట్రెన్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు… ఈనెల 23 నుంచి ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
టీజీ పాలిసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు
- ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్స్ - 23-07-2025
- ధ్రువపత్రాల పరిశీలన - 24-07-2025
- వెబ్ ఆప్షన్లు - 24-07-2025 నుంచి 25-07-2025
- ఫ్రీజింగ్ ఆప్షన్స్ - 25-07-2025
- ప్రొవిజినల్ సీట్ల కేటాయిపు - 28-07-2025 లోపు..
- సెల్ఫ్ రిపొర్టింగ్ - 28-07-2025 నుంచి 29-07-2025.
- కాలేజీలో రిపోర్టింగ్ - 28-07-2025 నుంచి 30-07-2025.
- ఓరియంటేషన్ - 28-07-2025 నుంచి
- తరగతులు ప్రారంభం - 31-07-2025
- అధికారిక వెబ్ సైట్ - https://tgpolycet.nic.in/default.aspx

టీజీ పాలిసెట్- 2025 ఫస్ట్ ఫేజ్ లో భాగంగా 65.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. మొత్తం సీట్లలో ప్రభుత్వ కాలేజీల్లో 82 శాతం సీట్లు నిండగా… ప్రైవేట్ కాలేజీల్లో 50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో 10,012 సీట్లు భర్తీ కాలేదు.
ఈ ఏడాది జరిగిన పాలిసెట్పరీక్షకు మొత్తం 1,06,716 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో మొత్తం 80,949 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కొత్తగా మహబూబాబాద్ జిల్లా కేసముద్రం, సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో 2 ప్రభుత్వ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలోని పాలిటెక్నిక్ ప్రభుత్వ కళాశాలల సంఖ్య 57 నుంచి 59కి పెరిగింది.ఈసారి మొత్తం 28,632 సీట్లు అందుబాటులో ఉన్నాయి.