...
...
Next Story

తెలంగాణ : ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లు - ఇవాళ మెరిట్ లిస్ట్ విడుదల, ఎలా చెక్ చేసుకోవాలంటే..?

తెలంగాణలోని బాసర, మహబూబ్ నగర్ ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ప్రవేశాల జాబితాలు(మెరిట్) ఇవాళ విడుదల కానున్నాయి. విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ జాబితాను www.rgukt.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

Published on: Jul 4, 2025, 11:14:48 IST
By , , Telangana, Adilabad
Prefer HTon Google
Advertisement

తెలంగాణలోని రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం, బాసర, మహబూబ్ నగర్ క్యాంపస్ లో అడ్మిషన్లకు దరఖాస్తులు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ (2025-26) విద్యా సంవత్సరానికి మొత్తం 20, 258 అప్లికేషన్లు అందాయి.

ఇవాళ మెరిట్ జాబితా విడుదల

ఇవాళ తెలంగాణ ఆర్జీయూకేటీ ఎంపిక జాబితా విడుదల
ఇవాళ తెలంగాణ ఆర్జీయూకేటీ ఎంపిక జాబితా విడుదల

జూన్ 21వ తేదీతో ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ముగిసింది. ఆ తర్వాత ధ్రువపత్రాలను పరిశీలించిన అధికారులు… మెరిట్ లిస్ట్ పై కసరత్తు చేపట్టారు.ఈ ప్రక్రియ పూర్తి కావటంతో… ఇవాళ మెరిట్ జాబితాను విడుదల చేయనున్నారు. లిస్ట్ లో పేరున్న విద్యార్థులకు… ఐఐఐటీక్యాంపస్ లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు.

రాష్ట్రంలో బాసర కేంద్రంగా ఐఐఐటీక్యాంపస్ ఉండేది. అయితే ఈ విద్యా సంవత్సరం మహబూబ్ నగర్ లోనూ ప్రారంభించారు. ఈ రెండింటికి సంబంధించిన మెరిట్ లిస్ట్ ను ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. జూలై 7వ తేదీన ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్‌ ఉండనుంది.

పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన గ్రామీణ పేద విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుంది. వీరికే అత్యధికంగా సీట్లు కేటాయిస్తారు.ఈ ఏడాది బాసరలోని 1500 సీట్లు మాత్రమే కాకుండా… మహబూబ్‌నగర్‌ లోనూ ఐఐఐటీ క్యాంపస్ ప్రారంభమైంది. ఈ ఏడాది నుంచే ప్రవేశాలను ఖరారు చేశారు. ఇక్కడ 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

ఎలా చెక్ చేసుకోవాలంటే…

ఎంపికైన వారికి ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. వీరికి హాస్టల్ సదుపాయం ఉంటుంది. తాజాగా మార్కుల విధానం అమలు చేస్తుండటంతో… ప్రవేశాల ప్రక్రియలో కొన్ని మార్పులు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇవాళ అధికారులు విడుదల చేసే మెరిట్ జాబితాను https://www.rgukt.ac.in వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మెరిట్ జాబితాలో పేర్లన్న విద్యార్థులకు… జూలై 7వ తేదీ నుంచి కౌన్సెలింగ్ షురూ అవుతుంది.

గతేడాది వరకు తెలంగాణ టెన్త్ఫలితాలను గ్రేడింగ్ విధానంలో ప్రకటించారు. పాత పద్ధతికి స్వస్తి పలికిన తెలంగాణ సర్కార్… ఈ ఏడాది మార్కులను ప్రకటించింది. పాత పద్ధతిలోనే మార్కులను ప్రకటించే విధానాన్ని పునఃప్రారంభించింది. ఫలితంగా గ్రేడ్స్ కాకుండా… మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ఐఐఐటీ క్యాంపస్లలో ప్రవేశాలను కల్పించనున్నారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe