...
...
Next Story

ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం - ఏ సబ్జెక్ట్ ఎప్పుడంటే..?

ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అన్ని పేపర్లు కలిపి జూన్ 30వ తేదీతో ముగుస్తాయి. టెట్‌ పరీక్షలకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు.

Published on: Jun 18, 2025, 05:00:06 IST
By , , Telangana
Prefer HTon Google
Advertisement

తెలంగాణ టెట్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. ఇవాళ్టి నుంచి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ రెండు సెషన్లలో ఎగ్జామ్స్ జరుగుతాయి.

ప్రతిరోజూ 2 సెషన్లు…

తెలంగాణ టెట్ పరీక్షలు 2025
తెలంగాణ టెట్ పరీక్షలు 2025

ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల వరకు మొదటి సెషన్ ఉంటుంది. ఇక మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకు రెండో సెషన్‌ నిర్వహిస్తారు. ఇందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే విద్యాశాఖ హాల్ టికెట్లను కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

పరీక్షలు రాసే అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్ కు చేరుకోవాలని అధికారులు సూచించారు. ఎగ్జామ్ సెంటర్ లోకి స్మార్ట్ వాచీలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ పరీక్షా కేంద్రంలోకి అనుమతించవు. హాల్ టికెట్ తో పాటు ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ లాంటి అధికారిక ధ్రువపత్రాలను వెంట తీసుకెళ్లాలి.

ఈసారి ఎన్ని దరఖాస్తులంటే…?

ఈసారి తెలంగాణ టెట్పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీటిలో పేపర్‌-1కు 63,261 , పేపర్‌-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి. రెండు పేపర్లకు దరఖాస్తు చేసినవారి సంఖ్య 15 వేలకుపైగా ఉంది. జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి.

జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక జూన్ 24 న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది. జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) ఉంటుంది.

జూలైలో టెట్ ఫలితాలు…

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe