...
...
Next Story

సింగిల్​ ఛార్జ్​తో 620 కి.మీ రేంజ్​- ఇండియాలో తొలి టెస్లా ఎలక్ట్రిక్ కారు​ లాంచ్​! హైలైట్స్​ ఇవే..

టెస్లా తన మోడల్​ వై ఎస్​యూవీని ఇండియాలో లాంచ్​ చేసింది. ఈ మోడల్​ ధరలు, రేంజ్​ సహా పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jul 15, 2025, 11:01:36 IST
By ,
Prefer HTon Google
Advertisement

ప్రపంచ ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా.. ఎట్టకేలకు ఇండియాలోకి అడుగుపెట్టింది. అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​కి చెందిన ఈ టెస్లా, తన అత్యధికంగా అమ్ముడైన మోడల్ వై ఎస్​యూవీని దేశంలోకి రూ. 59.89 లక్షల (ఎక్స్-షోరూమ్, ముంబై) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. అంతేకాదు, బ్రాండ్ మొదటి డీలర్‌షిప్ ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్​లో ప్రారంభమైంది. టెస్లా మోడల్ వై ఆర్​డబ్ల్యూడీ, లాంగ్ రేంజ్ ఆర్​డబ్ల్యూడీ వేరియంట్‌లలో లభిస్తుంది. టాప్-స్పెక్ లాంగ్-రేంజ్ వేరియంట్ ధర రూ. 67.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ముంబై) గా నిర్ణయించడం జరిగింది.

టెస్లా మోడల్​ వై
టెస్లా మోడల్​ వై

అయితే ఈ ధరలకు ఫుల్​ సెల్ఫ్​ డ్రైవింగ్​ కెపాసిటీ టెస్లాకార్లు ఇవ్వడం లేదు. ఇందుకోసం రూ. 6లక్షలు ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. అదే సమయంలో.. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఫీచర్లకు డ్రైవర్ చురుకైన పర్యవేక్షణ అవసరమని కార్ల టెస్లా తన వెబ్‌సైట్‌లో పేర్కొంటూ ఒక డిస్​క్లైమర్​ని కూడా జోడించింది. ఈ సెల్ఫ్-డ్రైవింగ్ ఫీచర్లు అభివృద్ధి చెందుతున్న కొద్దీ కారుకు ఓవర్-ది-ఎయిర్ అప్‌డేట్‌లు లభిస్తాయి.

టెస్లా మోడల్ వై: డిజైన్..

మోడల్​ 3 ఆధారంగా రూపొందించిన టెస్లా మోడల్​ వై ఎలక్ట్రిక్​ ఎస్​యూవీతో.. పానోరమిక్​ గ్లాస్​రూఫ్​, మరింత స్పోర్టి, కూపే లాంటి సిల్హౌట్‌తో భారతదేశానికి సంస్థ మినిమలిస్ట్ సౌందర్యాన్ని పరిచయం చేస్తుంది. దీని బాహ్య రూపం చాలా మినిమలిస్టిక్‌గా ఉంటుంది. ఇందులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, సన్నని హెడ్‌ల్యాంప్‌లు, స్టైల్​ కాకుండా ప్రాక్టికాలిటీపై దృష్టి సారించిన ఏరోడైనమిక్ ఆకారం ఉన్నాయి.

టెస్లా మోడల్ Y: స్పెసిఫికేషన్లు

భారతదేశంలో టెస్లా మోడల్ వై ఆర్​డబ్ల్యూడీ (రియర్-వీల్-డ్రైవ్) వెర్షన్ 60 కేడబ్ల్యూహెచ్​, పెద్ద 75 కేడబ్లూహెచ్​ బ్యాటరీ ప్యాక్‌లను అందిస్తుంది. ఆర్​డబ్ల్యూడీ వేరియంట్ సుమారు 295 హెచ్‌పీ ఉత్పత్తి చేసే సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్‌తో పవర్​ని పొందుతుంది. 60 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ఒక్కో ఛార్జ్‌కు డబ్ల్యూఎల్​టీపీ ప్రకారం 500 కి.మీ. రేంజ్‌ను అందిస్తుంది. అయితే లాంగ్-రేంజ్మోడల్ 622 కి.మీ. వరకు రేంజ్​ని అందిస్తుంది. 0-100 కి.మీ/గం వేగాన్ని 5.9 సెకన్లలో చేరుకుంటుందని పేర్కొన్నారు. 15 నిమిషాల సూపర్‌ఛార్జ్ వినియోగదారులకు 238 కి.మీ. నుంచి 267 కి.మీ. వరకు రేంజ్‌ను అందిస్తుంది.

టెస్లా మోడల్ వై- ఫీచర్లు..

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks