...
...
Next Story

తెలంగాణలో పీజీ ప్రవేశాలు - ఆగస్టు 4 నుంచి 'సీపీగెట్' పరీక్షలు

తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే సీపీగెట్ - 2025 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఈ గడువు జూలై 17వ తేదీతో పూర్తవుతుంది. అయితే పరీక్షల నిర్వహణపై అధికారులు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 4వ తేదీ నుంచి సీపీగెట్ పరీక్షలు ప్రారంభమవుతాయని వెల్లడించారు.

Published on: Jul 12, 2025, 10:34:42 IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం రుసుం లేకుండా ఈ గడువు జూలై 17వ తేదీతో పూర్తవుతుంది.

టీజీ సీపీగెట్ ప్రవేశాలు - 2025
టీజీ సీపీగెట్ ప్రవేశాలు - 2025

టీజీ సీపీగెట్- 2025 ప్రవేశ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రూ. 500 ఆలస్య రుసుంతో జూలై 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. రూ. 2 వేలతో జూలై 28 వరకు ఛాన్స్ ఉంటుందని అధికారులు తాజాగా ప్రకటించారు. https://cpget.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ ప్రాసెస్ చేసుకోవచ్చు.

ఆగస్టు 4 నుంచి పరీక్షలు…

టీజీ సీపీగెట్ పరీక్షల నిర్వహణపై ఉస్మానియా యూనివర్శిటీ అధికారులు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 4వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. మొత్తం 45 సబ్జెక్టులకు ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సబ్జెక్టుల వారీగా తేదీలను త్వరలోనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.

టీజీ సీపీగెట్ -2025 లో భాగంగా పలు సబ్జెక్టుల్లో ప్రవేశాల కోసం ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. పరీక్ష మొత్తం 100 మార్కులకు ఉంటుంది.100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు అడుగుతారు. ర్యాంకులు, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. విడతల వారీగా ప్రవేశాల ప్రక్రియను చేపడుతారు.

టీజీ సీపీగెట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…

  1. అభ్యర్థులు ముందుగా https://cpget.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే అప్లికేషన్ ఫీజు ఆప్షన్ పై క్లిక్ చేసి ఫీజు చెల్లించాలి.
  3. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ పై క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చేయాలి.
  4. చివరగా సబ్మిట్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.
  5. హాల్ టికెట్ డౌన్లోడ్ కోసం రిజిస్ట్రేషన్ నెంబర్ తప్పనిసరి. కాబట్టి రిజిస్ట్రేషన్ కాపీని జాగ్రత్తగా ఉంచుకోవాలి.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ సీపీగెట్ - 2025కు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe