...
...
Next Story

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు - 'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ, ఇదే ఫైనల్ ఛాన్స్..!

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు కూడా పూర్తయింది. తాజాగా మూడో విడత రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. సీట్లు రాని విద్యార్థులతో పాటు కొత్తవాళ్లు దోస్త్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.

Published on: Jun 14, 2025 09:36 AM IST
By , , Telangana
Prefer HTon Google
Advertisement

దోస్త్ - 2025 ప్రవేశాలు కొనసాగుతున్నాయి. సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తిగా… అధికారులు మరో అప్డేట్ ఇచ్చారు. శుక్రవారం నుంచే థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అర్హులైన విద్యార్థులు.. జూన్ 19వ తేదీ వరకు దోస్త్ వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

'దోస్త్' థర్డ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు…

తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాలు

దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి మొదలైంది. ఈ గడువు జూన్ 19తో పూర్తవుతుంది. రిజిస్ట్రేషన్లుచేసుకున్న వాళ్లు ఈ తేదీల్లోనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవచ్చు. జూన్‌ 23న విద్యార్థులకు సీట్ల కేటాయింపు ఉంటుంది. జూన్ 23వ తేదీ నుంచి 28వ తేదీల మధ్య సీట్లు పొందిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. జూన్ 24 నుంచి 28వ తేదీల మధ్య ఓరియేంటేషన్ ఉంటుంది. జూన్ 30వ తేదీన డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయి.

దోస్త్ అన్ని విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ ను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ప్రత్యేకంగా షెడ్యూల్ జారీ చేస్తారు.

‘దోస్త్’ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…

  1. ముందుగా దోస్త్అధికారిక వెబ్ సైట్ https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే Candidate Pre-Registrationపై క్లిక్ చేయాలి.
  3. ఇక్కడ మీ ఇంటర్ హాల్ టికెట్ నెంబర్, పుట్టినతేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి. చివరల్లో Aadhaar Authentication ప్రక్రియ పూర్తవుతుంది.
  4. ఆ తర్వాత దోస్త్ ఐడీ జనరేట్ అవుతుంది.
  5. దీని ద్వారా మీ లాగిన్ ప్రక్రియ ముందుకెళ్తుంది.
  6. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా నిర్ణయించిన ఫీజును తప్పకుండా చెల్లించాలి.
  7. దోస్త్ లాగిన్ వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు:

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe