'దోస్త్' సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు - వెబ్ ఆప్షన్లకు మరికొన్ని గంటలే గడువు...!

డిగ్రీ ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే సెకండ్ ఫేజ్ లో వెబ్ ఆప్షన్లకు గడువు దగ్గరపడింది. జూన్ 9వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.

Published on: Jun 8, 2025, 19:38:33 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం దోస్త్ - 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మొదటి విడత సీట్ల కేటాయింపు పూర్తి కాగా… ప్రస్తుతం సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.

దోస్త్ ప్రవేశాలు 2025
దోస్త్ ప్రవేశాలు 2025

దోస్త్ సెకండ్ ఫేజ్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఈ గడువు రేపటితో (జూన్ 9) పూర్తి కానుంది. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.

ముఖ్య తేదీలు:

  • తెలంగాణ దోస్త్ సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు జూన్‌ 13వ తేదీన ఉంటుంది.
  • ఈ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు.. జూన్ 13వ తేదీ నుంచి ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయవచ్చు.
  • ఈ గడువు జూన్ 18వ తేదీతో పూర్తవుతుంది. కాలేజీలో రిపోర్టింగ్ చేయకపోతే… సీటు రద్దవుతుంది.
  • తెలంగాణ దోస్త్ 3వ విడత రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జూన్‌ 13 నుంచి ఉంటుంది. ఇందుకు జూన్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
  • జూన్‌ 13 నుంచి 19 వరకు వెబ్‌ ఆప్షన్లు ఎంచుకోవచ్చు.
  • జూన్‌ 23న దోస్త్థర్డ్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
  • 3 విడతలు పూర్తి అయిన తర్వాత సీట్లు ఖాళీగా ఉంటే స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లను ప్రకటిస్తారు. దీనిపై తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More