రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల కేటాయింపు కోసం ఈఏపీసెట్ కౌన్సెలింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా… రిజిస్ట్రేషన్లతో పాటు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయింది. ప్రస్తుతం వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ గడువు ఇవాళ్టితో(జూలై 10) పూర్తి కానుంది. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు… వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

తెలంగాణ ఈఏపీసెట్- 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ లో భాగంగా రిజిస్రేషన్ చేసుకున్న అభ్యర్థులు తప్పకుండా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. వీరికి మాత్రమే సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే అభ్యర్థి సాధించే ర్యాంక్ ఎంతో కీలకం. అంతేకాకుండా రిజర్వేషన్ ఉంటే పరిగణనలోకి తీసుకుంటారు. రెండింటి ఆధారంగా…. సీటును కేటాయిస్తారు.
వెబ్ ఆప్షన్ల ఎంపిక చాలా జాగ్రత్తగా చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కాలేజీలోని ప్రమాణాలు, ప్లేస్ మెంట్ తో పాటు ఇతర అంశాలను బేరీజీ వేసుకొని కాలేజీలను ఎంచుకోవటం మంచిందని నిపుణులు సూచిస్తున్నారు. https://tgeapcet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ఈఏపీసెట్రిజిస్ట్రేషన్ తో పాటు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు.
బుధవారం వరకు 74 వేలకుపైగా అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు ఎంచుకున్నారు. ఇవాళ కూడా సమయం ఉండటంతో… మరికొంత అభ్యర్థులు కాలేజీలను ఎంచుకునే అవకాశం ఉంది. అయితే వీరికి జూలై 13లోపు మాక్ సీట్ల కేటాయింపు ఉంటుందని అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత విద్యార్థులు రెండు రోజులపాటు వెబ్ ఆప్షన్లను కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది.
మాక్ కౌన్సెలింగ్ ఏంటంటే…?
ఈ ఏడాది నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియలో ఉన్నత విద్యా మండలి కొన్ని మార్పులు తీసుకువచ్చింది. వెబ్ ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులకు మాక్కౌన్సెలింగ్ ఉంటుంది. ఈ విధానంలో భాగంగా విద్యార్థికి వచ్చిన ర్యాంక్… ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా మాక్ సీట్(ప్రాథమికంగా) అలాట్‌మెంట్ చేస్తారు. విద్యార్థులకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తారు. ఆ తర్వాత ఏమైనా మార్పులు చేసుకునే అవకాశం ఇస్తారు. చివరగా ఫైనల్ సీట్ అలాట్‌మెంట్ చేస్తారు.
ఈ విధానంతో…. విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13వ తేదీన లేదా ఆలోపు ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది. ఆ తర్వాత ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కల్పిస్తారు. అంటే జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది.
జూలై 18న సీట్ల కేటాయింపు…
{{/usCountry}}ఈ విధానంతో…. విద్యార్థులు తమ ప్రాధాన్యతలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడుతుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం… జూలై 13వ తేదీన లేదా ఆలోపు ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు) ఉంటుంది. ఆ తర్వాత ప్రాధాన్యతలను మార్చుకునే అవకాశం కల్పిస్తారు. అంటే జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం ఉంటుంది.
జూలై 18న సీట్ల కేటాయింపు…
{{/usCountry}}ప్రస్తుతం రిజిస్ట్రేషన్లు చేసుకుని వెబ్ ఆప్షన్లనుఎంచుకున్న అభ్యర్థులకు… జూలై 18వ తేదీ లేదా ఆలోపే తుది విడత సీట్ల కేటాయింపు ఉంటుంది. సీట్లు పొందే విద్యార్థులు…. జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇక జూలై 25వ తేదీ నుంచి సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది.