టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ - 2025 : ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - మీ అలాట్‌మెంట్ ఇలా చెక్ చేసుకోవచ్చు
టీజీ ఈఏపీసెట్ - 2025 ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మాక్ సీట్ల కేటాయింపు జరగగా..పలువురు ఆప్షన్లు మార్చుకున్నారు. దీంతో ఇవాళ విద్యార్థులకు సీట్లను కేటాయించనున్నారు. tgeapcet.nic.in/default వెబ్ సైట్ ద్వారా అలాట్ మెంట్ చెక్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్లు ప్రక్రియ పూర్తి కాగా… ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు. ఇప్పటికే మాక్ కౌన్సెలింగ్ ప్రక్రియ ద్వారా పలువురు అభ్యర్థులు ఆప్షన్లు కూడా మార్చుకున్నారు. దీంతో ఇవాళ(జూలై 18) ఇంజినీరింగ్ సీట్లను కేటాయించనున్నారు.

టీజీ ఈఏపీసెట్(ఇంజినీరింగ్ స్ట్రీమ్) ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ కోసం 95,256 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. వీరిలో 94,059 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారు. ఇప్పటికే వీరికి మాక్ సీట్ల కేటాయింపు జరగగా… తక్కువ ఆప్షన్లు ఇచ్చిన వారికి సీటు అలాట్ కాలేదు. దీంతో ఈ నెల 14,15 తేదీల్లో ఆప్షన్ల మార్పునకు కూడా అవకాశం ఇచ్చారు. అభ్యర్థులకు నచ్చిన కాలేజీలు, బ్రాంచ్‌లు అలాట్ కాకపోవడంతో విద్యార్థులు… మార్పులు చేర్పులు చేసుకున్నారు. ఈ ప్రక్రియ కూడా పూర్తి కావటంతో… ఇవాళ ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించనున్నారు.
ఇవాళ ఈఏపీసెట్ఫస్ట్ ఫేజ్ కు సంబంధించి సీట్లు పొందే విద్యార్థులు… జూలై 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
అలాట్ మెంట్ ఎలా చెక్ చేసుకోవాలంటే..?
- అభ్యర్థులు ముందుగా https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలోని సీటు అలాట్ మెంట్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ లాగిన్ వివరాల ఎంట్రీ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
- ఈ విడతలో సీటు అలాట్ కాని వారు రెండో విడత కౌన్సెలింగ్ లో పాల్గొనాలి.
ఈ ఏడాది జరిగిన టీజీ ఈఏపీసెట్ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఫలితాలను చూస్తే... 2,20, 326 మంది దరఖాస్తు చేసుకోగా..2,07, 190 మంది హాజరయ్యారు. వీరిలో 1,51, 779 క్వాలిఫై కాగా... ఉత్తీర్ణత శాతం 73.26గా నమోదైంది. బాలికలు 65, 120 మంది ఉత్తీరులు కాగా... 86,659 మంది బాలురులు క్వాలిఫై అయ్యారు. బాలిక ఉత్తీర్ణత శాతం 73.88గా ఉండగా… బాలురది 72.79 శాతంగా నమోదైంది. వీరంతా కూడా ఇంజినీరింగ్ సీట్ల కోసం పోటీ పడుతున్నారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో… గతేడాది ఫీజులేఈసారి కూడా ఉండనున్నాయి. ఇదే విషయంపై ఫీజుల నియంత్రణ కమిటీ ప్రకటన విడుదల చేయనుంది. కోర్టు ఆదేశాలతో… ఫీజులను ఫిక్స్ చేస్తూ నిర్ణయం తీసుకోనుంది. ఫీజుల పెంపు లేకపోతే… విద్యార్థులకు బారం తప్పినట్లు అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ (ఇంజినీరింగ్ స్ట్రీమ్) ప్రక్రియకు సంబంధించిన అప్డేట్స్ ఇక్కడ తెలుసుకోవచ్చు
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper












