...
...
Next Story

ఇంజినీరింగ్ విద్యార్థులకు అలర్ట్ - టీజీ​ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల, ముఖ్య తేదీలివే

తెలంగాణలోని ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూన్ 28వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ముఖ్య తేదీల వివరాలను పూర్తి కథనంలో చూడండి….

Published on: Jun 27, 2025 02:45 PM IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

బీటెక్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీజీ ఈఏపీసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ ఖరారైంది. ఈ మేరకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వివరాలను పేర్కొంది. మొత్తం 3 విడతల్లో సీట్ల భర్తీని చేపటనున్నారు. జూన్ 28వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. జూలై 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది. జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు:

  • జూలై 28వ తేదీ నుంచి ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందులో భాగంగా జూలై 7వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు అవకాశం ఉంటుంది.
  • జూలై 1వ తేదీ నుంచి జూలై 8వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
  • జూలై 6 నుంచి జూలై 10 వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక.
  • జూలై 10వ రోజు ఫ్రీజింగ్ ఆప్షన్.
  • జూలై 13వ తేదీన ప్రాథమికంగా సీట్ల కేటాయింపు (మాక్ సీట్లు కేటాయింపు).
  • జూలై 14వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మార్పులు చేర్పులకు అవకాశం.
  • జూలై 15వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఆప్షన్లపై ఫ్రీజింగ్.
  • జూలై 18వ తేదీన ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు.
  • జూలై 18 నుంచి 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్.

సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ :

  • అభ్యర్థుల స్లాట్ బుకింగ్ - 25-07-2025
  • సర్టిఫికెట్ల వెరిఫికేషన్ - 26-07-2025
  • వెబ్ ఆప్షన్ల నమోదు - 26-07-2025 నుండి 27-07-2025
  • వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ 27-07-2025
  • 30-07-2025 లోపు తాత్కాలిక సీటు కేటాయింపు (మాక్ సీటు అలాట్ మెంట్)
  • ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ కు 30-07-2025 నుంచి 01-08-2025 వరకు అవకాశం.
  • కాలేజీలో ఫిజికల్ రిపోర్టింగ్ 31-07-2025 నుండి 02-08-2025 వరకు అవకాశం.

ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్

  • స్లాట్ బుకింగ్ - 05-08-2025.
  • సర్టిఫికెట్ల వెరిఫికేష్ - 06-08-2025.
  • వెబ్ ఆప్షన్ల ఎంట్రీ - 06-08-2025 నుంచి 07-08-2025 వరకు అవకాశం.
  • వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ 07-08-2025.
  • తాత్కాలిక సీటు(మాక్ సీటు అలాట్ మెంట్) కేటాయింపు 10-08-2025 లోపు
  • 10-08-2025 నుండి 12-08-2025 వరకు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ కు అవకాశం.
  • బ్రాంచ్/కాలేజీ మార్పు కోసం రిపోర్టింగ్ 11-08-2025 నుండి 13-08-2025 వరకు అవకాశం ఉంటుంది.
  • కాలేజీ జాయినింగ్ వివరాల అప్డేట్ - 14-08-2025.

టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్
టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్

ఇక ఇంటర్నల్ స్లైడింగ్ షెడ్యూల్ ను తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఇంటర్నల్ స్లైడింగ్ ఆప్షన్ల ఎంట్రీకి 18-08-2025 నుంచి 19-08-2025 వరకు అవకాశం ఉంటుంది. ఆగస్టు 19వ తేదీన ఆప్షన్లు ఫ్రీజింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 22లోపు స్లైడింగ్ సీటు కేటాయింపు ఉంటుంది. 22-08-2025 నుండి 23-08-2025 మధ్య కొత్త బ్రాంచ్‌కు రిపోర్టింగ్(సీటు పొందిన కాలేజీలో) చేసుకోవచ్చు. ఆగస్టు 23వ తేదీన స్పాట్ అడ్మిషన్లకు సంబంధించిన ప్రకటన ఉంటుంది. సీటు పొందే విద్యార్థులు తప్పనిసరిగా ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయాలి. లేకపోతే సీటను రద్దు చేస్తారు.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe