టీజీ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఈనెల 14 నుంచే స్లాట్ బుకింగ్, ముఖ్య తేదీలివే
తెలంగాణ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. మొత్తం రెండు విడతల్లో సీట్లను భర్తీ చేయనున్నారు. అర్హత పొందిన విద్యార్థులు… జూన్ 14 నుంచి 18వ తేదీ వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. ముఖ్యమైన తేదీల వివరాలను పూర్తి కథనంలో తెలుసుకోండి….
తెలంగాణ ఈసెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. ఇప్పటికే ఎంట్రెన్స్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. అర్హత పొందిన పాలిటెక్నిక్ విద్యార్థులకు… బీటెక్ సెకండ్ ఇయర్ , బీఫార్మసీ సెకండ్ ఇయర్ లోకి అడ్మిషన్లు కల్పిస్తారు. ఈసెట్ 2025లో అర్హత పొందిన వారికి కౌన్సెలింగ్ ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి బుధవారం విడుదల చేసింది.

టీజీ ఈసెట్ 2025 కౌన్సెలింగ్ - ముఖ్య తేదీలు:
- తెలంగాణ ఈసెట్-2025 కౌన్సెలింగ్ జూన్ 14 నుంచి ప్రారంభంకానుంది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేస్తారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
- తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా జూన్ 14 నుంచి 18 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
- జూన్ 17 నుంచి 19వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది.
- జూన్ 17వ తేదీ నుంచి నుంచి 21 వరకు వెబ్‌ఆప్షన్లు ఎంచుకోవాలి.
- జూన్ 25వ తేదీన ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.
- ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందే విద్యార్థులు జూన్ 29వ తేదీలోపు సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవాలి.
ఫైనల్ ఫేజ్ :
- ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్‌లో భాగంగా జూలై 11 నుంచి 13 వరకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి.
- జూలై 14వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది.
- జులై 14 నుంచి 15వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల ఎంపిక
- జూలై 15వ తేదీన వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ కు అవకాశం ఉంటుంది.
- జూలై 18వ తేదీలోపు సీట్ల కేటాయింపు
- జులై 18వ తేదీ నుంచి 20వ తేదీ మధ్యలో సెల్ఫ్ రిపోర్టింగ్(వెబ్ సైట్ ద్వారా)
- జూలై 19 నుంచి 22వ తేదీల మధ్య సీటు పొందిన కాలేజీలో రిపోర్టింగ్ చేయాలి.
- జూలై 23వ తేదీలోపు విద్యార్థులు అడ్మిషన్లు పొందాలి. లేకపోతే సీటు రద్దవుతుంది.
తెలంగాణ ఈసెట్2025 స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి జులై 22వ తేదీన మార్గదర్శకాలను జారీ చేస్తారు. జూలై 29వ తేదీలోపు సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది.
ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ ఈసెట్ - 2025 ర్యాంక్ కార్డును డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు
ఈ లింక్ పై క్లిక్ చేసి కౌన్సెలింగ్ షెడ్యూల్ పూర్తి వివరాలతో కూడిన పీడీఎఫ్ ను పొందవచ్చు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper


