టీజీ ఎడ్‌సెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే
బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఎడ్‌సెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 21 నుంచి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆగస్టు 4 నుంచి వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి.
Published on: Jul 12, 2025 11:02 AM IST
By HT Telugu Desk, Maheshwaram Mahendra Chary, Telangana, Hyderabad
రాష్ట్రంలో బీఈడీ కోర్సులో ప్రవేశానికి నిర్వహించిన ఎడ్‌సెట్ - 2025 కు సంబంధించి కీలక అప్డేట్ వచ్చేసింది. అడ్మిషన్ల ప్రక్రియ కోసం కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఈ వివరాల ప్రకారం… జూలై 14వ తేదీన కౌన్సెలింగ్ నోటిఫికేషన్ ను జారీ చేస్తారు. జూలై 21 నుంచి ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

టీజీ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ - ముఖ్య తేదీలు
- టీజీ ఎడ్ సెట్ కౌన్సెలింగ్ (ఫస్ట్ ఫేజ్) నోటిఫికేషన్ - 14 జూలై 2025
- రిజిస్ట్రేషన్లు ప్రారంభం - 21 జూలై 2025
- రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ - 31 జూలై 2025
- టీజీ ఎడ్‌సెట్ - 2025 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ముఖ్య తేదీలివే
- వెబ్ ఆప్షన్లు - 4 ఆగస్టు 2025 నుంచి5 ఆగస్టు 2025.
- వెబ్ ఆప్షన్ల ఎడిట్ - 6 ఆగస్టు 2025.
- ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు -9 ఆగస్టు 2025
- కాలేజీల్లో రిపోర్టింగ్ - 11 ఆగస్టు 2025 - 14 ఆగస్టు 2025.
- తరగతులు ప్రారంభం - 18 ఆగస్టు 2025.
- అధికారిక వెబ్ సైట్- https://edcet.tgche.ac.in/
తెలంగాణ ఎడ్ సెట్ పరీక్షలు జూన్ 1వ తేదీన జరిగాయి. మొదటి షెషన్ ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు రెండు షిఫ్టుల్లో పరీక్షను నిర్వహించారు.
ఈసారి జరిగిన ఎడ్సెట్కు 38,754 మంది దరఖాస్తు చేసుకోగా 32,106 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మొత్తం 96.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా…సీట్ల కేటాయింపు ఉంటుంది.
టీజీ ఎడ్ సెట్ ర్యాంకు కార్డు - డౌన్లోడ్ ప్రాసెస్
- అభ్యర్థులు ముందుగా టీజీ ఎడ్ సెట్ https://edcet.tgche.ac.in/ అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో డౌన్ లోడ్ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయండి
- అభ్యర్థి ఎడ్ సెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలి.
- వ్యూ ర్యాంక్ కార్డుపై క్లిక్ చేయాలి.
- స్క్రీన్ పై విద్యార్థి ర్యాంకు కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ర్యాంకు కార్డును డౌన్ లోడ్ చేసుకొని ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు చాలా కీలకం. జాగ్రత్తగా ఉంచుకోవాలి.













