తెలంగాణ టెట్ - 2025 అభ్యర్థులకు అలర్ట్... హాల్ టికెట్ల విడుదల ఎప్పుడంటే..?
తెలంగాణ టెట్ హాల్ టికెట్లపై మరో అప్డేట్ వచ్చేసింది. జూన్ 11వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పరీక్షలు జూన్ 18వ తేదీ నుంచి జరగనున్నాయి.
తెలంగాణ టెట్ హాల్ టికెట్లు ఆలస్యం కానున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… హాల్ టికెట్లు ఇవాళ విడుదల కావాల్సి ఉంది. అయితే హాల్ టికెట్లు జూన్ 11వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ రోజు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
18 నుంచి పరీక్షలు…
విద్యాశాఖ నిర్ణయంచిన షెడ్యూల్ ప్రకారం… జూన్ 18 నుంచి టెట్పరీక్షలు ప్రారంభమవుతాయి. అన్ని సబ్జెక్టుల పరీక్షలు జూన్ 30వ తేదీ నాటికి ముగుస్తాయి. నిజానికి జూన్ 15 నుంచే పరీక్షలు ప్రారంభం కావాల్సిన ఉన్నప్పటికీ…. విద్యాశాఖ తాజాగా మార్పులు చేసింది. 15 నుంచి కాకుండా 18వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు ఇటీవలే ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హాల్ టికెట్లను ఇవాళ కాకుండా 11వ తేదీన విడుదల చేయనున్నట్లు తెలిసింది.
టీజీ టెట్ - 2025 హాల్ టికెట్లు డౌన్లోడ్ ప్రాసెస్..
- అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ' Hall Tickets(I) Download 2024 ఆప్షన్ పై నొక్కాలి.
- జర్నల్ నెంబర్ తో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ హాల్ టికెట్ డిస్ ప్లే అవుతుంది.
- డౌన్లోడ్ అనే ఆప్షన్ పై నొక్కి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.
- పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే హాల్ టికెట్ తప్పనిసరి.
ఈసారి తెలంగాణ టెట్ పరీక్షలకు మొత్తం 1,83,653 దరఖాస్తులు అందాయి. వీటిలో పేపర్-1కు 63,261 , పేపర్-2కు 1,20,392 అప్లికేషన్లు వచ్చాయి. వీరంతా కూడా పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్నారు.
జూన్ 22న టెట్ రిజల్ట్స్…
షెడ్యూల్ వివరాల ప్రకారం…. జూన్ 18, 19 తేదీల్లో పేపర్ 2 మ్యాథ్స్, సైన్స్ పరీక్షలు జరుగుతాయి. జూన్ 20 నుంచి 23 వరకు పేపర్ 1 పరీక్షలు ఉంటాయి. ఇక జూన్ 24 న పేపర్ 2తో పాటు పేపర్ 1 పరీక్ష జరుగుతుంది.జూన్ 27వ తేదీన పేపర్ 1 ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. జూన్ 28వ తేదీ నుంచి 30 వరకు పేపర్ 2 (సోషల్ స్టడీస్) ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇదే రోజు ఒక సెషనల్ లో పేపర్ 2(మ్యాథ్స్, సైన్స్) ఉంటుంది.
తెలంగాణ టెట్పరీక్షలు ఈనెల 30వ తేదీతో పూర్తవుతాయి. ఆపై ప్రాథమిక కీలను వెల్లడిస్తారు. వీటిపై అభ్యంతరాలను స్వీకరిస్తారు. అన్ని పరిశీలించిన తర్వాత…. జూలై 22వ తేదీన టెట్తుది ఫలితాలను ప్రకటిస్తారు.














