...
...
Next Story

ఈరోజు అజ ఏకాదశి.. మహా విష్ణువు అనుగ్రహం కలగాలంటే మీ రాశి ప్రకారం ఏం చేయాలో తెలుసుకోండి!

అజ ఏకాదశి 2025: ఈ సంవత్సరం, శ్రావణ మాసంలోని కృష్ణ పక్షం ఏకాదశి రోజున అజ ఏకాదశి ఉపవాసం ఉండి పూజిస్తారు. అజ ఏకాదశి రోజున కొన్ని పరిహారాలను పాటించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోవడంతో పాటు జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. మరి ఏ రాశుల వారు ఏం చేస్తే మంచిదో ఇప్పుడే తెలుసుకోండి.

Published on: Aug 19, 2025, 07:00:02 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

ఆగస్టు 19న అజ ఏకాదశి: ఆగస్టు 19న ఆజ ఏకాదశి పర్వదినాన్ని మత విశ్వాసాల ప్రకారం ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినదిగా భావిస్తారు. ఈ రోజున శ్రీ హరి మహావిష్ణువును పూజించడం వల్ల ఆశించిన ఫలితాలు లభిస్తాయి.

అజ ఏకాదశి 2025
అజ ఏకాదశి 2025

కాబట్టి మంగళవారంవిష్ణువును, లక్ష్మీమాతను పూర్తి ధర్మంతో పూజించడంతో పాటు, రాశిచక్రాన్ని బట్టి ఈ పరిహారాలను అనుసరించడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. మరి ఏ రాశుల వారు ఏం చేస్తే మంచిదో ఇప్పుడే తెలుసుకోండి.

మేష రాశి

మేషరాశి వారు అజ ఏకాదశి రోజున పసుపు రంగు దుస్తులు ధరించి విష్ణు సహస్రనామ పారాయణం చేసి విష్ణువు అనుగ్రహం పొందాలి.

వృషభ రాశి

వృషభ రాశి వారు పాలలో కుంకుమ పువ్వును కలిపి అజ ఏకాదశి రోజున మహావిష్ణువుకి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

మిథున రాశి

జీవితంలో సంతోషం మరియు సంపదను కొనసాగించడానికి అజ ఏకాదశి రోజున నారాయణ కవచాన్ని పఠించాలి.

కర్కాటక రాశి

ఈ ఏకాదశిని పురస్కరించుకుని కర్కాటక రాశి వారు స్వచ్ఛమైన నీటిలో పసుపు కలిపి అరటి మొక్కకు సమర్పించడం మంచిది. దీనితో విష్ణువు అనుగ్రహం లభిస్తుంది.

సింహ రాశి

అజ ఏకాదశి నాడు విష్ణువు యొక్క ప్రత్యేక అనుగ్రహం పొందడానికి, సింహ రాశి వారు లక్ష్మీ నారాయణుడిని పూజించాలి. విష్ణుమూర్తికి పసుపు, చందనం, పసుపు పువ్వులను సమర్పించండి.

కన్యా రాశి

ఈ రాశి వారు తమ చేతులతో తయారు చేసిన పరమాన్నాన్ని నారాయణుడికి సమర్పించడం ద్వారా జీవితంలోని ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు.

తులా రాశి

తులా రాశి వారు అజ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పసుపు ముద్దలను సమర్పించి లక్ష్మీ నారాయణుడిని పూజిస్తే మంచిది. మరుసటి రోజు, వీటిని బీరువా లేదా పర్సులో ఎరుపు గుడ్డలో కట్టి పెట్టండి. దీంతో ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.

వృశ్చిక రాశి

ధనుస్సురాశి జాతకులు తమ ఆరాధ్య శ్రీ హరి విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి చందనాన్ని సమర్పిస్తే మంచిది.

మకర రాశి

మకరరాశి వారు అజ ఏకాదశి రోజున నారాయణుని అనుగ్రహం పొందడానికి బూందీ లడ్డూను సమర్పించాలి.

కుంభ రాశి

ఈ రాశి వారు అజ ఏకాదశి నాడు శ్రీ హరి విష్ణువు ప్రత్యేక అనుగ్రహం పొందడానికి పసుపు రంగు దుస్తులను ధరించి విష్ణువును, లక్ష్మీదేవిని కలిసి పూజించండి. మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః జపించండి.

మీన రాశి

ఈ రాశి వారు అజ ఏకాదశి నాడు విష్ణుమూర్తికి పరమాన్నాన్ని సమర్పించి విష్ణు చాలీసా పఠించాలి.

(గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేం చెప్పలేం. నిపుణుల సూచనల ప్రకారమే మేం ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.)

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks