...
...
Next Story

తెలంగాణలో పీజీ ప్రవేశాలు - 'సీపీగెట్' దరఖాస్తులు ప్రారంభం, ఇలా రిజిస్ట్రేషన్ చేసుకోండి

తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్ - 2025 రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. ఇందులో భాగంగా…. ఎంఎస్సీ, ఎంఏ, ఎంకామ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు https://cpget.tgche.ac.in/ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

Published on: Jun 19, 2025, 11:08:55 IST
By , , Telangana, Hyderabad
Prefer HTon Google
Advertisement

రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాల ఎంట్రెన్స్ కోసం సీపీగెట్ - 2025 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆన్ లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ షురూ అయింది. అర్హులైన అభ్యర్థులు… ఫీజు చెల్లించి, అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సీపీగెట్ పరీక్ష ద్వారా ఎంఏ, ఎంకాం, ఎంఎస్‌సీ తదితర పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

చివరి తేదీ ఎప్పుడంటే..?

సీపీగెట్ - 2025
సీపీగెట్ - 2025

సీపీగెట్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూలై 17వ తేదీతో పూర్తవుతుంది. రూ. 500 ఆలస్య రుసుంతో జూలై 24వ తేదీ వరకు అప్లయ్ చేసుకునే వీలు ఉంటుంది. రూ. 2 వేలతో జూలై 28 వరకు ఛాన్స్ ఉంటుంది. ఆగస్టు మొదటి వారంలో ఎంట్రన్స్ పరీక్షలు జరుగుతాయి.

రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఇలా…

  1. అభ్యర్థులు https://cpget.tgche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  2. హోం పేజీలో కనిపించే అప్లికేషన్ ఫీజు పేమెంట్ ఆప్షన్ పై క్లిక్ చేసి నిర్ణయించిన ఫీజును చెల్లించాలి.
  3. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు వివరాలతో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
  4. మీ విద్యా అర్హతలను నమోదు చేయాలి. ఫొటో, సంతకం వంటి వాటిని అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  5. చివరల్లో సబ్మిట్ నొక్కి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
  6. ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఈ నెంబర్ ఆధారంగా హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.

రాష్ట్రంలోని ఉస్మానియా, తెలంగాణ, కాకతీయ, శాతవాహన, పాలమూరు, మహాత్మాగాంధీ, మహిళా యూనివర్సిటీలు, జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఉన్న పీజీ కాలేజీల్లోని కోర్సుల్లో ప్రవేశాలకు సీపీగెట్‌ - 2025 నిర్వహిస్తారు. ఇందుకు సబ్జెక్టుల వారీగా ఎంట్రెన్స్ పరీక్షలను నిర్వహిస్తారు. ర్యాంకుల ఆధారంగా సీట్లను కేటాయిస్తారు. ఈ ఏడాది కూడా ఉస్మానియా యూనివర్శిటీనే సీపీగెట్ ప్రవేశ బాధ్యతలు చూస్తోంది.

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ సీపీగెట్ - 2025 అప్లికేషన్ ఫీజు చెల్లించుకోవచ్చు

ఈ లింక్ పై క్లిక్ చేసి టీజీ సీపీగెట్ - 2025 అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks