TG TET Results 2025 : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల - మీ స్కోర్ ఇలా చెక్ చేసుకోండి
TET Results 2025 in Telangana : తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లి స్కోర్ చెక్ చేసుకోవచ్చు. టెట్ స్కోర్ కు డీఎస్సీ రిక్రూట్ మెంట్ లో వెయిటేజీ ఉంటుంది.
తెలంగాణ టెట్ ఫలితాలు వచ్చేశాయ్..! పరీక్షకు హాజరైన అభ్యర్థులు విద్యాశాఖ వెబ్ సైట్ లోకి స్కోర్ కార్డును చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది జనవరి 2 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి.
మొత్తం 2,75,753 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 2,05,278 మంది పరీక్ష రాశారు. రెండు పేపర్లు కలిపి 83,711 మంది ఉత్తీర్ణత సాధించారు. పేపర్-1లో 59.48 శాతం మంది, పేపర్-2లో 31.21 శాతం అభ్యర్థులు అర్హత సాధించారు.
టెట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
- తెలంగాణ టెట్(2) 2024 పరీక్ష రాసిన విద్యాశాఖ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలో కనిపించే TS TET(2) 2024 Resultsపై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ లేదా జర్నల్ నెంబర్, ఎగ్జామ్ పేపర్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ స్కోర్ కార్డు ఇక్కడ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి కాపీని పొందవచ్చు.
- భవిష్యత్ అవసరాల దృష్ట్యా టెట్ స్కోర్ కార్డు కాపీ జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఏడాదికి రెండు సార్లు టెట్(టీచర్ ఎలిజబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గతేడాదిలో రెండు సార్లు నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. రెండో నోటిఫికేషన్ కు సంబంధించిన రాత పరీక్షలు ఈ ఏడాది జనవరిలో జరిగాయి. ప్రాథమిక కీలపై అభ్యంతరాలను స్వీకరించిన విద్యాశాఖ తాజాగా ఫలితాలను ప్రకటించింది.
మరోవైపు ఈ ఏడాదిలో డీఎస్సీనోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కూడా ఉంది. ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. ఈ కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ లో 5 నుంచి 6వేల మధ్య టీచింగ్ ఖాళీలను భర్తీ చేసే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంటుంది.
టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు టెట్ స్కోర్ డీఎస్సీ పరీక్షలో కీలకంగా ఉంటుంది. డీఎస్సీ రిక్రూట్ మెంట్ లో టెట్ స్కోర్ కు వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలకు భారీ సంఖ్యలోనే టీచర్ అభ్యర్థులు హాజరవుతుంటారు.
ఈ లింక్ పై క్లిక్ చేసి తెలంగాణ టెట్ అభ్యర్థులు నేరుగా ఫలితాలను చెక్ చేసుకోవచ్చు
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper












