...
...
Next Story

UGC NET June 2025 ఫలితాలు ఎప్పుడు వస్తాయి? ఎలా చెక్​ చేసుకోవాలి?

యూజీసీ నెట్​ 2025 ఫలితాలు ఎప్పుడు వస్తాయి? ఎలా చెక్​ చేసుకోవాలి? ఫైనల్​ ఆన్సర్​ కీని ఎప్పుడు విడుదల చేస్తారు? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Jul 14, 2025 06:03 AM IST
By ,
Prefer HTon Google
Advertisement

యూజీసీ నెట్ జూన్ 2025 ఫలితాలను త్వరలోనే అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.in లో విడుదల చేయనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). ఫలితాలతో పాటు ఫైనల్​ ఆన్సర్ కీని కూడా విడుదల చేయనుంది. లింక్ యాక్టివేట్ అయిన తర్వాత, అభ్యర్థులు తమ లాగిన్ వివరాలతో లాగిన్ అయి ఫలితాలను చూసుకోవచ్చు.

యూజీసీ నెట్ ఫలితాలు 2025 చెక్​ చేయడానికి అధికారిక వెబ్‌సైట్ ఏది?

UGC NET June 2025 ఫలితాలు ఎప్పుడు వస్తాయి?
UGC NET June 2025 ఫలితాలు ఎప్పుడు వస్తాయి?

అభ్యర్థులు తమ యూజీసీ నెట్ జూన్ 2025 ఫలితాలను ఎన్టీఏ యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ ugcnet.nta.ac.inలో చెక్​ చేసుకోవచ్చు.

యూజీసీ నెట్ జూన్ సెషన్ 2025 ఫలితాలు ఎప్పుడు?

గత సంవత్సరాల ట్రెండ్‌లను బట్టి చూస్తే, యూజీసీ నెట్ ఫలితాలు, తుది ఆన్సర్ కీ సాధారణంగా.. తాత్కాలిక ఆన్సర్ కీ విడుదలైన 2-4 వారాల్లోపు విడుదలవుతాయి. అయితే, తాత్కాలిక కీ జులై 5న విడుదలైంది. దీనిపై అభ్యంతరాల స్వీకరణ జులై 8న ముగిసింది.

యూజీసీ నెట్ జూన్ 2025 ఫలితాలను ఆన్‌లైన్‌లో ఎలా ఎల్​ చేసుకోవాలి?

మీ యూజీసీ నెట్ ఫలితాలను చెక్​, స్కోర్​కార్డును డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ కింది దశలను అనుసరించండి:

1. ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించండి.

2. పబ్లిక్ నోటీసుల విభాగంలో 'UGC NET June 2025 Result' లింక్‌పై క్లిక్ చేయండి.

3. మీ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ లేదా పుట్టిన తేదీని ఉపయోగించి లాగిన్ అవ్వండి.

4. మీ ఫలితాన్ని చూసి, డౌన్‌లోడ్ చేసుకోండి.

5. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్‌అవుట్ తీసుకోండి.

యూజీసీ నెట్ 2025 పరీక్షా విధానం ఎలా ఉంటుంది?

యూజీసీ నెట్ పరీక్షకంప్యూటర్ ఆధారిత పరీక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో:

పేపర్ II: సబ్జెక్ట్-నిర్దిష్ట

రెండు పేపర్‌లలో ఆబ్జెక్టివ్-రకం, మల్టిపుల్​ ఛాయిస్​ ప్రశ్నలు ఉంటాయి.

యూజీసీ నెట్‌కు ఎవరు అర్హులు?

  • భారతీయ విశ్వవిద్యాలయాలు , కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్
  • జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, అసిస్టెంట్ ప్రొఫెసర్
  • అర్హత ప్రమాణాలలో కనీసం 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ (రిజర్వ్‌డ్ కేటగిరీలకు 50%) ఉండాలి.

యూజీసీ నెట్ 2025 మార్కింగ్ స్కీమ్ ఎలా ఉంటుంది?

ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు

నెగటివ్ మార్కింగ్ లేదు.

సమాధానం ఇవ్వని ప్రశ్నలకుఎటువంటి మార్కులు లభించవు.

ఒక ప్రశ్న తప్పుగా ఉన్నట్లయితే, దానిని ప్రయత్నించిన అందరికీ పూర్తి మార్కులు ఇస్తారు.

యూజీసీ నెట్ జూన్ 2025లో ఏ సబ్జెక్టులు ఉంటాయి?

యూజీసీ నెట్ 2025 పరీక్ష 83 సబ్జెక్టులలో నిర్వహిస్తారు. వాటిలో:

హిందీ, ఇంగ్లీష్, సంస్కృతం, ఉర్దూ, కన్నడ, పంజాబీ, తమిళం, తెలుగు, అస్సామీ, మరాఠీ, గుజరాతీ, ఫ్రెంచ్, అరబిక్, చైనీస్, స్పానిష్, రష్యన్, లైబ్రరీ సైన్స్, జర్నలిజం, లేబర్ వెల్ఫేర్ సహా అనేక ఇతర సబ్జెక్టులు ఉన్నాయి.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe