సింగిల్​ ఛార్జ్​తో 320 కి.మీ రేంజ్​- అదిరిపోయే బుకింగ్స్​ పొందిన ఈ ఎలక్ట్రిక్​ బైక్​పై బిగ్​ అప్డేట్​!

ఎక్స్​47 క్రాసోవర్ ఎలక్ట్రిక్​ బైక్​ డెలివరీలను ప్రారంభించింది అల్ట్రావైలెట్​. ఈ బైక్​ గరిష్ఠంగా 323 కి.మీ రేంజ్​ని ఇస్తుంది. అంతేకాదు ఇందులో అనేక భద్రతా ఫీచర్స్​ ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..

Published on: Oct 24, 2025, 09:52:32 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బెంగళూరుకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అల్ట్రావైలెట్ ఆటోమోటివ్ తమ సరికొత్త ఎలక్ట్రిక్ ఎక్స్​47 క్రాసోవర్ మోడల్ డెలివరీలను ప్రారంభించింది. ఈ బైక్‌ను ఆవిష్కరించిన కొద్ది వారాల్లోనే కస్టమర్లకు అందించడం విశేషం. ఇంతకుముందు పర్ఫార్మెన్స్ ఎఫ్​77 మోటార్‌సైకిల్‌తో గుర్తింపు పొందిన ఈ కంపెనీ, ఇప్పుడు ఎక్స్​47 ద్వారా పెద్ద మార్కెట్‌ను లక్ష్యంగా చేసుకుంటోంది. ఎక్స్​47 బైక్​ని పూర్తిగా భారతదేశంలోనే డిజైన్, అభివృద్ధి, తయారీ చేయబడం జరిగింది. ఇది అల్ట్రావైలెట్ ఇంజనీరింగ్ సామర్థ్యాన్ని చాటిచెబుతోంది.

అల్ట్రావైలెట్​ ఎక్స్47 క్రాసోవర్ ఎలక్ట్రిక్​ బైక్​.. (Arjan Bahadur Singh/HT Auto)
అల్ట్రావైలెట్​ ఎక్స్47 క్రాసోవర్ ఎలక్ట్రిక్​ బైక్​.. (Arjan Bahadur Singh/HT Auto)

ఎలక్ట్రిక్​ బైక్ బుకింగ్‌లు ప్రారంభించిన మొదటి 24 గంటల్లోనే 3,000కు పైగా బుకింగ్‌లు వచ్చాయని సమాచారం. హై-పర్ఫార్మెన్స్ బైక్‌ల మీద ఆసక్తి ఉన్న వారిని మాత్రమే టార్గెట్ చేసే అల్ట్రావైలెట్ సంస్థ, ఇప్పుడు ఎక్స్​47 ద్వారా సాధారణ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన కొనుగోలుదారుల వైపు అడుగులు వేస్తోంది!

అల్ట్రావైలెట్​ ఎక్స్​47 క్రాసోవర్​: ధరలు, వేరియంట్లు..

అల్ట్రావైలెట్​ ఎక్స్47 క్రాసోవర్ మొత్తం నాలుగు వేరియంట్లలో లభిస్తుంది. అవి ఒరిజినల్​, ఒరిజినల్​+, రెకాన్​, రెకాన్​+. వీటి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 2.49 లక్షల నుంచి రూ. 3.99 లక్షల మధ్య ఉన్నాయి.

ఒరిజినల్​, ఒరిజినల్​+ వేరియంట్లలో 7.1 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. రెకాన్​, రెకాన్​+ వేరియంట్లలో దీని కంటే పెద్దదైన 10.3 కేడబ్ల్యూహెచ్​ బ్యాటరీ యూనిట్ లభిస్తుంది.

భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో అధికారికంగా డెలివరీలు మొదలయ్యాయి. పెరుగుతున్న ఆర్డర్‌లకు అనుగుణంగా ఉత్పత్తిని సైతం క్రమంగా పెంచుతామని కంపెనీ ప్రకటించింది. నిర్దిష్ట నగరాల వారీగా సంఖ్యలను అల్ట్రావైలెట్ విడుదల చేయనప్పటికీ, ఈ దశలవారీ డెలివరీ విధానం ఎక్కువ సంఖ్యలో బైక్‌లను ఉత్పత్తి చేసే ముందు ప్రారంభ డెలివరీలను, కస్టమర్ అనుభవాలను పకడ్బందీగా చేయాలనే దాని ప్రాధాన్యతను సూచిస్తుంది.

అల్ట్రావైలెట్​ ఎక్స్47 క్రాసోవర్​- ఆకర్షణీయమైన డిజైన్..

డిజైన్ విషయానికి వస్తే, అల్ట్రావైలెట్​ ఎక్స్47 క్రాసోవర్​ ఒక అడ్వెంచర్ బైక్‌ను పోలినట్టు ఉంటుంది. దాని గంభీరమైన స్టాన్స్​, లేయర్డ్ బాడీవర్క్, వెడల్పాటి హ్యాండిల్‌బార్ దీనికి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి.

ఈ ఎలక్ట్రిక్​ బైక్​ని ఎఫ్​77 ఆర్కిటెక్చర్ ఆధారంగా రూపొందించినప్పటికీ, కాస్ట్-అల్యూమినియం సబ్‌ఫ్రేమ్, అప్‌డేట్ చేసిన స్టీరింగ్ జియోమెట్రీతో విభిన్నంగా ఉంటుంది.

దాదాపు 200 ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్‌తో, ఎక్స్​47 బైక్ కఠినమైన పట్టణ రోడ్లు, చిన్నపాటి ఆఫ్-రోడ్ ట్రయల్స్‌కు సిద్ధంగా ఉంది. అయితే, సాధారణ పెట్రోల్ అడ్వెంచర్ మోటార్‌సైకిళ్ల కంటే ఇది కొంత బరువుగా ఉంటుంది!

ఈ ఈ- బైక్​ రైడింగ్ పొజిషన్‌ను సుదీర్ఘ ప్రయాణాలకు అనుగుణంగా సౌకర్యవంతంగా మార్చారు. హ్యాండిల్‌బార్ న్యూట్రల్‌గా అందుబాటులో ఉంటుంది.

మొత్తం మీద ఈ బైక్​ స్పోర్టీ పర్ఫార్మెన్స్, రోజువారీ ప్రాక్టికల్ ఉపయోగం మధ్య తేడాను తగ్గిస్తుందని చెప్పవచ్చు.

అల్ట్రావైలెట్​ ఎక్స్47 క్రాసోవర్​- ఇంజన్, బ్యాటరీ సామర్థ్యం..

ఎక్స్​47 బైక్‌లో పర్మనెంట్-మాగ్నెట్ సింక్రోనస్ ఎలక్ట్రిక్ మోటార్‌ను ఉపయోగించారు. దీనికి రెండు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు జత చేశారు. అవి..

7.1 కేడబ్ల్యూహెచ్​ (చిన్నది)- 211 కి.మీ రేంజ్​

10.3 కేడబ్ల్యూహెచ్​ (పెద్దది)- 323 కి.మీ రేంజ్

రెకాన్​+ సుమారు ఎనిమిది సెకన్లలో 0 నుంచి 100 కేఎంపీహెచ్​ వేగాన్ని అందుకోగలదు. దీని గరిష్ట వేగం 145 కేఎంపీహెచ్​.

ఈ బైక్‌లో ఇంటి వద్ద ఛార్జింగ్ కోసం 1.6 కేడబ్ల్యూ ఆన్‌బోర్డ్ ఛార్జర్ ఉంది. తక్కువ సమయంలో ఛార్జింగ్ చేయాలనుకునే వారి కోసం వేగవంతమైన ఛార్జింగ్ సొల్యూషన్స్‌కు కూడా ఇందులో అవకాశం ఉంది.

అత్యాధునిక ఫీచర్లు: యూవీ హైపర్​సెన్స్​ రాడార్ టెక్నాలజీ..

అల్ట్రావైలెట్​ ఎక్స్47 క్రాసోవర్​ ఎలక్ట్రిక్​ బైక్ దాని సామర్థ్యంతో పాటు, ఈ సెగ్మెంట్‌లో పరిచయం చేసిన అత్యాధునిక సాంకేతికత కారణంగా ప్రత్యేకంగా నిలుస్తుంది.

దీని ముఖ్య ఫీచర్లలో ఒకటి రాడార్ ఆధారిత భద్రతా వ్యవస్థ, దీనిని UV Hypersense అని పిలుస్తారు. ఈ ధరలో ఉన్న మోటార్‌సైకిళ్లలో ఈ ఫీచర్ చాలా అరుదు.

ఈ వ్యవస్థలో వెనుక నుంచి ఢీకొనే ప్రమాదాలకు హెచ్చరిక, బ్లైండ్-స్పాట్ అలర్ట్‌లు, లేన్-చేంజ్ అసిస్టెన్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ముందు భాగంలో 200 మీటర్ల వరకు వాహనాలను గుర్తించి, ట్రాక్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. ఇది నగరాలు, హైవేల్లో రైడర్‌కు అదనపు భద్రతను అందిస్తుంది.

ఇతర ఫీచర్లు..

  • మల్టీ-లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్
  • స్విచ్చెబుల్ డ్యూయల్-ఛానల్
  • హిల్-హోల్డ్ అసిస్టెన్స్
  • తొమ్మిది-దశల రీజనరేటివ్ బ్రేకింగ్

సమాచార ప్రదర్శన కోసం 5-ఇంచ్​ ఫుల్లీ కలర్​ టీఎఫ్​టీ డిస్‌ప్లేని ఈ ఎలక్ట్రిక్​ బైక్​లో అందించారు. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సామర్థ్యం, లైవ్ డయాగ్నస్టిక్ సమాచారాన్ని అందిస్తుంది. ఎక్కువ ధర ఉన్న వేరియంట్లలో సోనీ సెన్సార్లతో డ్యూయల్ డ్యాష్ కెమెరాలు, ఇంటిగ్రేటెడ్ స్టోరేజ్ కూడా లభిస్తాయి. దీని ద్వారా రైడర్లు తమ ప్రయాణాలను రికార్డ్ చేసుకోవచ్చు.

అదనంగా, ఈ ఎక్స్​47 క్రాసోవర్​లో మూడు ప్రధాన రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి గ్లైడ్​, కాంబాట్​, బాలిస్టిక్​. ఇవి రైడర్ అవసరాలకు అనుగుణంగా పవర్ డెలివరీ, థ్రాటిల్ ప్రతిస్పందన, రీజనరేషన్ తీవ్రతను ఇవి మారుస్తాయి.

  • శరత్​ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్​ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్​పీరియెన్స్​తో ఇక్కడ బిజినెస్​, ఆటో, టెక్​, పర్సనల్​ ఫైనాన్స్​, నేషనల్​- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్​ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్​లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్​ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్​ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్​తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More