తెలంగాణకు శుభవార్త - రూ. 3 వేల కోట్లతో హైవే ప్రాజెక్ట్, కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ - పనాజీ ఎకనామిక్ కారిడార్‌లో భాగంగా తెలంగాణలోని గుడేబల్లూరు నుంచి మహబూబ్‌నగర్ వరకు రోడ్డు విస్తరించనున్నారు. ఇందుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాతీయ రహదారి (NH-167)ని 4 వరుసలుగా విస్తరించేందుకు రూ. 3,175 కోట్లు కేటాయించనున్నారు.
తెలంగాణకు కేంద్రం మరోసారి శుభవార్త చెప్పింది. కర్ణాటకలోని గూడె బేల్లూరు- తెలంగాణలోని మహబూబ్‌నగర్ మధ్య రూ. 3,175 కోట్ల ఖర్చుతో నాలుగు లైన్ల రోడ్డు విస్తరణకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సుమారు 80 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నాలుగు వరుసల ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం 3,175 కోట్ల రూపాయల వ్యయాన్ని కేటాయించారు.
తెలంగాణకు కేంద్రం శుభవార్త
హైదరాబాద్-పనాజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ రోడ్డు నిర్మాణం జరగనుంది. రాయచూర్, రాయచూర్, నారాయణపేట, దేవరకద్ర, మహబూబ్‌నగర్ మీదుగా హైదరాబాద్‌కు ఉన్న ఈ కనెక్టివిటీ మెరుగుపడటం వల్ల ఈ ప్రాంతంలో ఆర్థికపరమైన రంగాలతో పాటు లాజిస్టిక్స్ రంగాలు గణనీయంగా వృద్ధి చెందే అవకాశం ఉంది.
4 లైన్ల హైవేగా విస్తరణ…
ప్రస్తుతం గుడే బెల్లూర్ నుంచి మహబూబ్ నగర్ (జాతీయ రహదారి (NH 167 ) మధ్య ఉన్న కనెక్టివిటీ చాలా ఇబ్బందికరంగా ఉంది. పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రయాణాలు చాలా ఆలస్యంగా ఉంటున్నాయి. ఈ రోడ్డు గుడే బెల్లూర్, మగ్నూర్, మక్తల్, మర్రికల్, దేవరకద్ర, జక్లైర్, యలిగండ్ల, బందర్పల్లి గుండా వెళుతుంది. ఇలాంటి పట్టణాల మీదుగా వెళ్తే ఈ హైవేను విస్తరించాలని కేంద్రం నిర్మయించింది. ప్రస్తుతం నెలకొన్న సవాళ్లను పరిష్కరించడానికి… 4 లైన్ల హైవేగా అభివృద్ధి చేయనున్నారు.
ఈ తాజా హైవే ప్రాజెక్ట్ తో తెలంగాణలోని నారాయణపేట, మహబూబ్ నగర్ జిల్లాల కు చెప్పుకోదగ్గ ప్రయోజనం అందే అవకాశం ఉంది. ముఖ్యంగా లాజిస్టిక్ రవాణా సామర్థ్యాన్ని పెంచుతుంది, లాజిస్టిక్స్ ఖర్చును కూడా తగ్గిస్తుంది. ఈ ప్రాంతంలో సామాజిక-ఆర్థిక వృద్ధిని పెంచుతుంది.
హైదరాబాద్-పనాజీ ఆర్థిక కారిడార్‌లో భాగంగా గుడేబెల్లూర్ నుండి మహబూబ్‌నగర్ వరకు NH-167ను 4-లేన్లుగా విస్తరిస్తారు.క
రోడ్డు విస్తరణకు అయ్యే వ్యయం - రూ. 3,175.08 కోట్లు
విస్తరించే కి.మీ పరిధి - 80.01 కి.మీ
ఈ రోడ్డు విస్తరణతో సరుకు రవాణా సామర్థ్యం పెరుగుతుంది.
నారాయణపేట మరియు మహబూబ్‌నగర్ జిల్లాలలో కనెక్టివిటీని బలోపేతం చేస్తుంది.
NH-150 మరియు NH-167Nలను అనుసంధానించడం ద్వారా ఆర్థిక, సామాజిక, లాజిస్టిక్స్ నోడ్‌లను ఏకీకృతమవుతాయి. ఇది వాణిజ్యాన్ని పెంచుతుంది.
ప్రస్తుతం ఈ రోడ్డుపై జర్నీకి 3 గంటలు పడుతుండగా… విస్తరణతో గంటర్నరకు తగ్గుతుంది.