యూపీఎస్సీ అభ్యర్థులకు బిగ్ అప్డేట్! మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌పై క్లారిటీ, ఎప్పటి నుంచి అంటే..
యూపీఎస్సీ అభ్యర్థులకు అలర్ట్! యూపీఎస్సీ మెయిన్స్ 2025 పరీక్షల షెడ్యూల్‌ని తాజాగా విడుదల చేశారు. తేదీలు, టైమింగ్స్‌తో పాటు ఇతర వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్ఈ) మెయిన్స్ 2025 పరీక్షల టైమ్‌టేబుల్‌ను తాజాగా విడుదల చేసింది. ఈ పరీక్షలు 2025 ఆగస్టు 22, 23, 24, 30, 31 తేదీల్లో జరగనున్నాయి. పూర్తి వివరాలు..

యూపీఎస్సీ సీఎస్ఈ మెయిన్స్ 2025: టైమింగ్స్..
యూపీఎస్సీ మెయిన్స్పరీక్ష 2025ని ప్రతి రోజు రెండు సెషన్లలో నిర్వహిస్తారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం సెషన్ 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025: పరీక్షా విధానం..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సీఎస్ఈ పరీక్షా విధానం మూడు దశలుగా విభజించారు. ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కొక్కటి 200 మార్కులకు, రెండూ ఆబ్జెక్టివ్-రకం ప్రశ్నలు ఉంటాయి. పేపర్ II (సీశాట్) కేవలం అర్హత స్వభావం కలిగినది, అభ్యర్థులు కనీసం 33% మార్కులు సాధించాలి. రెండు పేపర్లు ఇంగ్లీష్, హిందీ భాషలలో నిర్వహిస్తారు.
మెయిన్స్ పరీక్షలో రెండు అర్హత పేపర్లు ఉంటాయి. పేపర్ ఏ (ఇండియన్ లాంగ్వేజ్), పేపర్ బీ (ఇంగ్లీష్), ఒక్కొక్కటి 300 మార్కులకు. మెరిట్ జాబితాకు పరిగణించే పేపర్లలో ఎస్సే), జనరల్ స్టడీస్ I నుంచి IV వరకు, ఒక ఆప్షనల్ సబ్జెక్టుకు సంబంధించిన రెండు పేపర్లు ఉంటాయి. వీటిలో ప్రతి ఒక్కటి 250 మార్కులకు ఉంటుంది.
- యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్షల ఫలితాాలు ఎప్పుడు? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్‌కు పిలుస్తారు. ఇది 275 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూలో కనీస మార్కులు అవసరం లేదు.
యూపీఎస్సీ సీఎస్ఈ 2025: ఖాళీలు..
ఈ సంవత్సరం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్), ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) వంటి ప్రతిష్టాత్మక సేవల్లో మొత్తం 979 ఖాళీలను భర్తీ చేయడానికి సివిల్ సర్వీసెస్ పరీక్ష జరుగుతోంది.
ఈ ఏడాది మే 25న యూపీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఆగస్ట్‌లో మెయిన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ రౌండ్ ఉంటుంది.
యూపీఎస్సీ సీఎస్ఈ మెయిన్స్ 2025అడ్మిట్ కార్డులు, సూచనలకు సంబంధించిన తదుపరి అప్‌డేట్‌ల కోసం అభ్యర్థులు యూపీఎస్సీ వెబ్‌సైట్‌ను నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORChitturi Eswara Karthikeya Sharathశరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు.Read More

E-Paper



