Vaibhav Suryavanshi Viral Video : "ఒక్కో ఫోటోకు రూ. 100 ఇస్తారా?" చిన్నారులతో వైభవ్ సూర్యవంశీ సరదా ముచ్చట! వీడియో వైరల్

Vaibhav Suryavanshi Viral Video : టీమ్ ఇండియా యువ క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన ఫన్నీ యాంగిల్‌తో సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నారు. తనతో ఫోటో దిగేందుకు వచ్చిన చిన్నారులను సరదాగా ఆటపట్టించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Published on: Apr 27, 2026, 16:36:09 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Vaibhav Suryavanshi Viral Video : తన అద్భుతమైన బ్యాటింగ్‌తో అతి చిన్న వయసులోనే అందరి దృష్టిని ఆకర్షించిన యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ…! కేవలం బ్యాట్ తోనే కాదు…. ఇప్పుడు తనలోని చిలిపి కోణంతో వార్తల్లో నిలిచాడు.

న్నారులతో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరదా ముచ్చట!
న్నారులతో యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ సరదా ముచ్చట!

రూ. 100 ఇస్తారా…?

ఇటీవల వైభవ్ సూర్యవంశీని కలిసేందుకు ఇద్దరు చిన్నారులు వచ్చారు. తమ అభిమాన క్రికెటర్ పక్కన నిలబడి ఫోటో దిగాలని వారు ఆరాటపడ్డారు. అయితే, ఆ సమయంలో వైభవ్ వారితో ఒక ఫన్నీ ప్రాంక్ చేశారు. "మీతో ఫోటో దిగాలంటే ఒక్కో ఫోటోకు వంద రూపాయలు ఇవ్వాలి……. ఇస్తారా?" అని ఎంతో సీరియస్‌గా అడిగారు.

వైభవ్ సరదాగా అడిగిన మాటలను ఆ చిన్నారులు నిజమని నమ్మారు. "అలాగే ఇస్తాం" అంటూ వారు జవాబివ్వడంతో వైభవ్ ఒక్కసారిగా నవ్వేశారు. వారి అమాయకత్వానికి మురిసిపోయిన వైభవ్….. వారితో ఎంతో క్యూట్‌గా ఫోటోలు దిగారు. చిన్నారులతో వైభవ్ వ్యవహరించిన తీరు…. ఆ సమయంలో ఆయన ముఖంలోని చిరునవ్వు అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

ఈ అద్భుతమైన దృశ్యాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో… అది కాస్తా క్షణాల్లో వైరల్ అయ్యింది. ఈ సరదా వీడియోను రాజస్థాన్ రాయల్స్ టీమ్.. ఆఫీషియల్ ఎక్స్ ఖాతాలో కూడా పోస్ట్ చేసింది.

వైభవ్ సూర్యవంశీ వినయానికి, ఆయనలోని హ్యూమర్ సెన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "మైదానంలో ఎంత దూకుడుగా ఉంటారో, బయట అంత సరదాగా ఉన్నారు" అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More