వరంగల్ 'నిట్'లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్య వివరాలివే
వరంగల్ లోని నిట్ క్యాంపస్ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఐదు ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిని కాంట్రాక్ట్ విధానంలో రిక్రూట్ చేయనున్నట్లు నోటిఫికేషన్ లో తెలిపారు. జూలై 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
వరంగల్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(నిట్) నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ జారీ అయింది. ఇందులో భాగంగా ఐదు ఖాళీలను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఇందుకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు… జూలై 9వ తేదీలోపు అప్లయ్ చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
వరంగల్ నిట్ లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు
వరంగల్ ‘నిట్’ ఉద్యోగ నోటిఫికేషన్ - ముఖ్య వివరాలు
ఉద్యోగ ప్రకటన - నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వరంగల్, తెలంగాణ రాష్ట్రం
అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా అప్లికేషన్ చేసుకోవాలి.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ జూలై 09వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఇంటర్వ్యూ తేదీలపై అభ్యర్థులకు మెయిల్ ద్వారా సమాచారం అందిస్తారు. దరఖాస్తులు ఎక్కువగా వస్తే పరీక్ష కూడా నిర్వహించవచ్చు.
అధికారిక వెబ్ సైట్ - https://nitw.ac.in/
సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు - 0870-2459191, 2459366
ఈమెయిల్: registrar@nitw.ac.in
News/News/వరంగల్ 'నిట్'లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్య వివరాలివే
News/News/వరంగల్ 'నిట్'లో కాంట్రాక్ట్ ఉద్యోగాలు - మంచి జీతం, ముఖ్య వివరాలివే