వి ఆర్ విత్ బంగ్లాదేశ్‌.. టీ20 ప్రపంచకప్‌లో ఇండియాతో మ్యాచ్ బాయ్‌కాట్‌.. పాకిస్థాన్ ప్రధాని రియాక్షన్ ఇదే

టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ఆడబోమని పాకిస్థాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఇది తెలివి తక్కువ నిర్ణయమనే విమర్శలూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన నిర్ణయాన్ని సమర్థిస్తూ, బంగ్లాదేశ్ కు మద్దతుగా ఉన్నామని అన్నాడు. 

Published on: Feb 5, 2026, 11:38:58 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

టీ20 ప్రపంచకప్ 2026లో ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ చుట్టూ నెలకొన్ని కాంట్రవర్సీ కొనసాగుతూనే ఉంది. ఇండియా, శ్రీలంక ఉమ్మడిగా ఆతిథ్యమిచ్చే ఈ వరల్డ్ కప్ లో ఇండియాతో మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నట్లు పాక్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో వివాదం మరింత ముదిరింది. దీనిపై తాజాగా పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ నోరు విప్పాడు. వి ఆర్ విత్ బంగ్లాదేశ్ అంటూ మాట్లాడాడు.

ఇండియా, పాకిస్థాన్ టీమ్ కెప్టెన్లు (AP)
ఇండియా, పాకిస్థాన్ టీమ్ కెప్టెన్లు (AP)

ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్

టీ20 ప్రపంచకప్ 2026లో పాకిస్థాన్ ఆడటంపైనే ఫస్ట్ డౌట్లు వచ్చాయి. కానీ టోర్నీలో ఆడతామని, ఇండియాతో మ్యాచ్ ను మాత్రం బాయ్ కాట్ చేస్తామని పాకిస్థాన్ ప్రభుత్వం సోషల్ మీడియాలో అనౌన్స్ చేసింది. ఫిబ్రవరి 15 న కొలంబోలో చిరకాల ప్రత్యర్థి భారత్ తో మ్యాచ్ కు మైదానంలోకి దిగమని చెప్పింది. దీనిపై పాక్ ప్రధాని షెహబాజ్ మాట్లాడారు.

ప్రధాని కామెంట్లు

‘‘ఐసీసీకి వ్యతిరేకంగా మా ప్రభుత్వం ఈ నిర్ణయం (ఇండియాతో మ్యాచ్ బాయ్ కాట్) తీసుకుంది. క్రీడల్లో రాజకీయాలను భాగం చేయొద్దు. ఇదే మా స్పష్టమైన వైఖరి. ఎంతో జాగ్రత్తగా చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. మేం బంగ్లాదేశ్ తో ఉన్నాం (వి ఆర్ విత్ బంగ్లాదేశ్). ఇది సరైన నిర్ణయమని నేను భావిస్తున్నా’’ అని ఫెడరల్ క్యాబినేట్ మీటింగ్ లో షెహబాజ్ పేర్కొన్నాడు.

అసలు ఏమైందంటే?

బంగ్లాదేశ్ లో హిందువుల హత్యలను భారత్ తీవ్రంగా ఖండిస్తోంది. బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ ను ఐపీఎల్ లో ఆడకుండా బీసీసీఐ వేటు వేసింది. దీంతో సెక్యూరిటీ రీజన్స్ కారణంగా చూపించి ఇండియాలో వరల్డ్ కప్ ఆడలేమని, తమ మ్యాచ్ లను వేరే చోటుకు తరలించాలని ఐసీసీని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) రిక్వెస్ట్ చేసింది. అయితే ఐసీసీ మాత్రం బంగ్లాదేశ్ ను టోర్నీ నుంచి తప్పించి, స్కాట్లాండ్ కు ఛాన్స్ ఇచ్చింది. దీనిపై పాక్ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

ఐసీసీ రియాక్షన్

టీ20 ప్రపంచకప్ లో ఇండియాతో మ్యాచ్ ను పాకిస్థాన్ బాయ్ కాట్ చేయడంపై ఐసీసీ సీరియస్ అయింది. మరోసారి నిర్ణయాన్ని రివ్యూ చేయాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. లేదంటే దీని ప్రభావం సుదీర్ఘ కాలం పాటు ఉంటుందని ఐసీసీ హెచ్చరించింది. కానీ దీనిపై ఇంకా పాకిస్థాన్ రియాక్టవలేదు. ఈ టీ20 ప్రపంచకప్ ఫిబ్రవరి 7న ప్రారంభం కానుంది. టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలో దిగుతోంది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More